వయసుకు సవాల్ విసురుతున్న 45 ఏళ్ల జాన్సన్.. 18 ఏళ్ల మెదడు, గుండె, పురుషాంగం టార్గెట్.. ఆసక్తికర వివరాలివే

By Mahesh KFirst Published Feb 2, 2023, 3:19 PM IST
Highlights

45 ఏళ్ల జాన్సన్ 18 ఏళ్ల వయసులో ఉండేలా రూపాంతరం చెందాలని ప్రయోగాలు చేస్తున్నారు. తన దేహంలోని అవయవాలు వయసుమళ్లకుండా ఆపడమే కాదు.. వాటిని 18 ఏళ్ల వయసులో ఉండే స్థితికి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఖరీదైన ట్రీట్‌మెంట్ ప్రారంభించారు. ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆయన గురించిన ఆసక్తికర వివరాలు ఇవే.
 

న్యూఢిల్లీ: ఆయనకు 45 ఏళ్లు. కానీ, ఆయన శరీర అవయవాలు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తాయి. ఆయన వయసుకే సవాల్ విసురుతున్నారు. వయసు మళ్లిన కొద్దీ శరీరంలో వచ్చే మార్పులను ఎదుర్కొని, వాటిని దాటవేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అంటే వయసు ముదరకుండా దేహాన్ని తయారుచేసుకోవడమే కాదు.. 18 ఏళ్ల వయసుకు తన బాడీని తేవాలని ప్రయోగాలు చేస్తున్నారు. ఆయనే సంపన్నుడైన సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రెన్యూవర్. పేరు బ్రియాన్ జాన్సన్. 18 ఏళ్ల వయసుకు వెళ్లడమే ఆయన లక్ష్యం.

అతని గురించి ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్ ఓ కథనం వెలువరించింది. ఈ యాంటీ ఏజింగ్ ప్రాసెస్ కోసం జాన్సన్ చుట్టూ 30 మంది మెడికల్ ప్రొఫెసనల్ టీమ్ పని చేస్తున్నది. ఒలివర్ జోల్మాన్ రీజెనరేటివ్ మెడిసిన్‌లో స్పెషలిస్టు, అతని టీమ్ జాన్సన్ అవయవాలు కాలంతోపాటు వయసుమళ్లకుండా తక్కువ వయసులో ఉండే స్థితికి తీసుకురావడానికి ప్రయోగాలు చేస్తున్నారు. 

వయసు, దీర్ఘకాలం జీవించడం వంటి అంశాలపై అందుబాటులో ఉన్న సైంటిఫిక్ లిటరేచర్‌ను విపరీతంగా చదువుతారు.

జాన్సన్ పై ఎల్లప్పుడూ నిఘా ఉంటుంది. పర్యవేక్షిస్తుంటూనే ఉంటారు. అందుకోసం జాన్సన్ కూడా భారీగా డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ ఏడాది తన బాడీ కోసం 2 మిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. 

Also Read: చావు లేని జీవితం: ఆ రహస్యాన్ని ఛేదించడానికి అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఇన్వెస్ట్!

జాన్సన్ తనకు 18 ఏళ్ల మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, పురుషాంగం,చర్మం, పళ్లు, రిక్టమ్, బ్లాడర్ , టెండన్స్ కావాలని ఆశిస్తున్నారు.

ఇలాంటి ఆలోచనలు చేస్తున్న జాన్సన్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. కానీ, వాటిని ఆయన తేలికగా తీసుకుంటున్నారు. తనపై చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన శరీరంలోని చాలా భాగాలు ఐదేళ్లు తక్కువ వయసులో ఉండే స్థితిలో ఉన్నాయని వైద్య బృందం చెబుతున్నది. ప్రస్తుతం జాన్స్‌కు 28 ఏళ్ల బాడీ ఉన్నదని, యుక్తవయసులో ఉండే ఊపిరితిత్తులు, మధ్య వయస్సులో ఉండే హృదయనాళాలు ఉన్నాయని వారి అధ్యయనంలో తేలింది.

click me!