వీళ్లేం తల్లిదండ్రులు?.. విమాన టికెట్ కొనాల్సి వస్తుందని యేడాది వయసున్న బిడ్డను ఎయిర్ పోర్టులో వదిలేసి పరార్..

By SumaBala BukkaFirst Published Feb 2, 2023, 8:31 AM IST
Highlights

టికెట్ కొనాల్సి వస్తుందని యేడాది వయసు బిడ్డను ఏకంగా ఎయిర్ పోర్టులో వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించారో తల్లిదండ్రులు. ఈ ఘటన ఇజ్రాయెల్ లోని ఓ ఎయిర్ పోర్టులో కలకలం రేపింది. 
 

ఇజ్రాయెల్‌ : ఇజ్రాయెల్‌ లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమాన టికెట్ కొనాల్సి వస్తుందని ఓ జంట తమ బిడ్డను ఎయిర్ పోర్టులోనే వదిలి వెళ్లిపోయేందుకు రెడీ అయ్యారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెంటనే అప్రమత్తం అవ్వడంతో వారి ప్రయత్నాన్ని నిరోధించారు. ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక జంట తమ బిడ్డను చెక్-ఇన్ కౌంటర్ వద్ద వదిలి దేశం నుండి పారిపోయేందుకు ప్రయత్నించడం అధికారులను షాక్‌కు గురిచేసిందని ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ మంగళవారం తెలిపింది.

బెల్జియన్ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న జంట, ఇజ్రాయెల్ నుండి ర్యాన్‌ఎయిర్ విమానంలో బెల్జియంలోని బ్రస్సెల్స్‌కు వెళ్లడానికి వచ్చారు. కానీ, వారు తమ సంవత్సరం వయసున్న మగబిడ్డ కోసం టిక్కెట్‌ను కొనలేదు. పిల్లలతో ప్రయాణించే వ్యక్తులు ల్యాప్ సీటు కోసం సుమారు 25 డాలర్లు చెల్లించాలి. లేదా ర్యాన్‌ఎయిర్ ప్రామాణిక ఛార్జీల ప్రకారం ప్రత్యేక సీటును కొనుగోలు చేయాలి.

బహిరంగంగా డ్యాన్స్ చేసిన జంటకు పదేళ్ల జైలు శిక్ష.. వీడియో ఇదే

బెల్టియం పాస్ పోర్టు ఉన్న ఆ తల్లిదండ్రులు తమతో పాటు చిన్నారిని తీసుకెళ్లాలనుకున్నారు. విమానాశ్రయానికి ఆలస్యంగా వచ్చారు. చెక్-ఇన్ కౌంటర్లు మూసేసిన తర్వాత టెర్మినల్ 1కి ఆలస్యంగా చేరుకున్నారు. అక్కడ సిబ్బంది వారిని ఆపి టికెట్ లు అడిగారు. అయితే, వారు రెండు టికెట్లే చూపించారు. శిశువుకు టికెట్ కొనలేదు. భద్రత సిబ్బంది ఆ చిన్నారి టికెట్ గురించి అడగగా.. క్యారియర్‌లో శిశువును వదిలి వెళ్లడానికి ప్రయత్నించారు. 

బిడ్డ కోసం టిక్కెట్ కొనకుండా, విమానాశ్రయ సిబ్బందితో వాదనకు దిగారు. ఫ్ట్రోలర్ లో ఉన్న చిన్నారిని అక్కడే వదిలేసి.. హడావుడిగా విమానం వైపు వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. ఇది చూసి భద్రతా సిబ్బంది అలర్ట్ చేయడంతో.. సెక్యూరిటీ అధికారులు వారిని అడ్డుకున్నారు. ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఫుటేజ్‌లో, చెక్-ఇన్ కౌంటర్‌లోని సిబ్బంది ఫ్ట్రోలర్ లో ఉన్న బిడ్డను కనుగోడానికి దుప్పటిని కదిలించడం చూడవచ్చు.

ఏం జరిగిందో గమనించిన విమానాశ్రయ సిబ్బంది దంపతులను అడ్డుకున్నారు. తిరిగి వెళ్లి బిడ్డను తీసుకురావాలని తల్లిదండ్రులను ఆదేశించారు. పోలీసులు, ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఈ ఘటన జనవరి 31వ తేదీన ఇజ్రాయెల్ లో చోటు చేసుకుంది. 

విమాన టికెట్ కొనాల్సి వస్తుందని ఏకంగా బిడ్డనే వదిలేసి వెళ్లిన ఘటన ఎయిర్ పోర్టులో కలకలం రేపింది. విషయం తెలిసినవారంతా షాక్ కు గురవుతున్నారు. సదరు తల్లిదండ్రుల గురించి తెలిసినవారు ఇలాంటివారు కూడా ఉంటారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మొదట తమకు అర్థం కాలేదని.. ఆ తరువాత షాక్ అయ్యామని సిబ్బంది తెలిపారు. 

click me!