దుబాయ్ లో ఘోర అగ్నిప్రమాదం.. 16 మంది మృతి..అందులో పలువురు భారతీయులు

By Rajesh KarampooriFirst Published Apr 16, 2023, 12:37 PM IST
Highlights

దుబాయ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులు సహా మొత్తం 16 మంది మరణించారు. మరో 9 మంది తీవ్రంగా గాయల పాలయ్యారు.

దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో 16 మంది మరణించారు. అదే సమయంలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుబాయ్‌లోని నివాస భవనంలోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. అల్ రాస్‌లో శనివారం అగ్నిప్రమాదం జరిగినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిధి తెలిపారు. మృతుల్లో కేరళకు చెందిన ఇద్దరు ఉన్నారు. వీరు భార్యభర్తలు. తమిళనాడుకు చెందిన మరో ఇద్దరు పురుషులు కూడా ఈ అగ్నిప్రమాదంలో తమ ప్రాణాలను కోల్పోయారు. వీరు భవనంలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్స్ రూమ్‌లో మధ్యాహ్నం 12.35 గంటలకు అగ్నిప్రమాదం సంభవించినట్టు సమాచారం అందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో పడ్డారు. పోర్ట్ సెయిడ్ , హమీరియా అగ్నిమాపక కేంద్రాల బృందాలు ఆపరేషన్ కోసం బ్యాకప్ అందించాయి. మధ్యాహ్నం 2.42 గంటలకు మంటలను అదుపులోకి తీసుకవచ్చారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ..  అగ్నిమాపక దళం సిబ్బంది మంటలను ఆర్పడంతో పాటు క్షతగాత్రులకు తక్షణ ప్రథమ చికిత్స అందించారని ప్రతినిధి తెలిపారు.

భవనంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే అగ్నిప్రమాదానికి దారితీసిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికార ప్రతినిధి తెలిపారు. దీనికి సంబంధించిన సమగ్ర విచారణ నివేదికను త్వరలో అందజేస్తామని తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. భవనం నుంచి మంటలు రావడం గమనించారు. సోషల్ మీడియాలో ఒక వీడియోలో.. ఒక అపార్ట్‌మెంట్ కిటికీలోంచి నల్లటి పొగ రావడం కనిపిస్తుంది. దీంతో పాటు పలు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

పేలుడు తర్వాత అగ్ని ప్రమాదం

పెద్ద చప్పుడు వినిపించిందని అదే భవనంలోని ఓ దుకాణంలో పనిచేస్తున్న ఉద్యోగి తెలిపారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే.. భవనంలో కిటికీలోంచి పొగలు రావడం ప్రారంభమయ్యాయి. కొందరు వ్యక్తులు సహాయం కోసం భవనంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. కాని పొగ కారణంగా ఏమీ చేయలేకపోయారు. 

click me!