రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం... 20మంది దుర్మరణం

Published : Feb 27, 2019, 04:21 PM IST
రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం... 20మంది దుర్మరణం

సారాంశం

రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగి.. 20మంది దుర్మరణం పాలైన సంఘటన ఈజిప్టు రాజధాని కైరాలో చోటుచేసుకుంది. 


రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగి.. 20మంది దుర్మరణం పాలైన సంఘటన ఈజిప్టు రాజధాని కైరాలో చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న రైలు.. రైల్వేస్టేషన్ లోని ప్లాట్ ఫాంను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీంతో.. ఇంజిన్ లో మంటలు చెలరేగాయి.

మంటల నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు పరుగులు తీశారు. అయినప్పటికీ.. 20మంది దుర్మరణం చెందారు. మరో 40మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

ఈ భార‌తీయుడు లేకపోయుంటే ఎంత దారుణం జ‌రిగేదో.. 26/11 త‌ర‌హా దాడి త‌ప్పిందా.?
10 నిమిషాల్లో 1.5 లీట‌ర్ల‌ కూల్‌డ్రింక్‌ తాగిన యువ‌కుడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిస్తే మైండ్ బ్లాంక్‌