మాట్లాడుకుందాం: ఇమ్రాన్‌ ఖాన్ శాంతి మంత్రం

By narsimha lodeFirst Published Feb 27, 2019, 4:10 PM IST
Highlights

భారత్‌తో చర్చలకు  పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు.సహనం కోల్పోతే పరిస్థితులు తన అదుపులో కానీ, మోడీ అదుపులో కానీ ఉండవన్నారు.

ఇస్లామాబాద్:  భారత్‌తో చర్చలకు  పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు.సహనం కోల్పోతే పరిస్థితులు తన అదుపులో కానీ, మోడీ అదుపులో కానీ ఉండవన్నారు.

బుధవారం నాడు ఆయన ఇస్లామాబాద్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ ప్రసంగాన్ని మీడియా ప్రసారం చేసింది.. శాంతియుత వాతావరణంలో చర్చించుకొంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. తాము రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేసినట్టుగా ఆయన ప్రకటించారు. కలిసి కూర్చొని మాట్లాడుకొందామని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు.

ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఏం చేయాలో చెప్పాలని ఇమ్రాన్ కోరారు.పూల్వామాలో సీఆర్‌ఫీఎఫ్ దాడి ఘటనకు సంబంధించి విచారణకు భారత్ కావాల్సిన  సహాయాన్నితాము అందిస్తామని ఆయన ప్రకటించారు.

టెర్రరిజం ప్రోత్సహించడానికి తమకు ఆసక్తి లేదని  ఆయన చెప్పుకొచ్చారు. యుద్ధం ప్రారంభిస్తే ఎప్పుడు ఎలా ముగింపుకు గురికానుందో తెలియదన్నారు. గతంలో జరిగిన యుద్ధాలన్నీ ఇలానే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

భారత్ వద్ద ఆయుధాలుంటే మా వద్ద కూడ ఆయుధాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ రెచ్చగొట్టడంతో రెండు యుద్ధ విమానాలను తాము కూల్చివేసినట్టుగా ఆయన ప్రకటించారు.


 

click me!