ఆఫ్ఘనిస్తాన్: భారతీయుల తరలింపు, కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ప్రతిరోజూ కాబూల్ నుంచి ఢిల్లీకి విమానాలు

By Siva KodatiFirst Published Aug 21, 2021, 9:23 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా కాబూల్ నుంచి ఢిల్లీకి ప్రతి రోజు రెండు విమానాలు నడపాలని నిర్ణయించింది.

ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా కాబూల్ నుంచి ఢిల్లీకి ప్రతి రోజు రెండు విమానాలు నడపాలని నిర్ణయించింది. మరోవైపు ఆఫ్ఘాన్‌లో తాలిబన్ల చెరలో వున్న భారతీయులు క్షేమంగా వున్నారు. వారిని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విదేశాంగ శాఖ అధికారులు. అటు అమెరికాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో ఏ క్షణంలోనైనా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానంలో వారిని తరలించే అవకాశం వుంది. 

కాగా, కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దాదాపు 150 మంది భారతీయులను బందీలుగా చేసుకున్నారు తాలిబన్లు. విమానాశ్రయం నుంచి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ట్రక్కుల్లో తరలించారు. ప్రయాణ పత్రాలు, గుర్తింపు  కార్డులు పరిశీలించారు. ఆఫ్ఘన్‌లో ఇంకా 1000 మందికి పైగా భారతీయులు వున్నట్లు సమాచారం. చాలా మంది భారత దౌత్య కార్యాలయం వద్ద తమ పేర్లను నమోదు చేసుకోలేదు.

click me!