కైరో‌లో ఘోర ప్రమాదం: 20 మంది మృతి,ఎనిమిది మందికి గాయాలు

By narsimha lodeFirst Published Nov 13, 2022, 9:30 AM IST
Highlights

ఉత్తర ఈజిప్టులో మినీ బస్సు  కాలువలో పడిపోవడంతో 20 మంది మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

కైరో:ఉత్తర ఈజిప్టులోని నైలు డెల్టాలో శనివారంనాడు  మినీ బస్సు కాలువలో పడిపోవడంతో 20 మంది మృతి చెందారు. దకాలియా గవర్నరేట్ లో జరిగిన ప్రమాదంలో డ్రైవర్ తో  పాటు ఎనిమిది మంది గాయపడ్డారు. డ్రగ్స్ సేవించి  డ్రైవర్ బస్సును నడిపినట్టుగా ప్రాథమిక పరీక్షలో  తేలిందని అధికారులు తెలిపారు.ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ ఫోన్ లో మాట్లాడినట్టుగా కూడ పోలీసులు అనుమానిస్తున్నారు.రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరకుని సహాయక  చర్యలు చేపట్టారు. ఈజిప్టులో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం.డ్రైవర్లు  ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తారు

.2021 గణాంకాల ప్రకారం  ఈజిప్టులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో  సుమారు ఏడువేల మంది మరణించారు.ఈ  ఏడాది జులైలో సెంట్రల్ ఈజిప్టులో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొన్న ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. మరో 35 మంది గాయపడ్డారు.ఈ ఏడాది అక్టోబరులో దకాలియాలో మినీ బస్సుపై ట్రక్కు  దూసుకుపోవడంతో  కనీసం  100 మంది మృతి చెందారు.కైరోకు ఈశాన్యంగా 100 కి.మీ దూరంలో ఉన్న దకాహియా  ఫ్రావిన్స్ లో ప్రమాదం జరిగిందని ఈజిప్టు అధికారులు తెలిపారు.మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా  ఉన్నారనిఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారి డాక్టర్  షరీఫ్ మకీన్ తెలిపారు. 
 

click me!