చిన్నారులను అమ్మే ప్రయత్నాల్లో తల్లిదండ్రులు.. అప్ఘాన్‌లో ఆర్థిక సంక్షోభంతో కుదైలవుతున్న కుటుంబాలు

By Mahesh KFirst Published Nov 13, 2022, 6:42 AM IST
Highlights

అఫ్ఘనిస్తాన్‌లో చాలా కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. తాజాగా, బాల్క్ ప్రావిన్స్‌లో  ఓ మహిళ తన చిన్నారి కూతురిని అమ్మేసి ఆర్థిక సమస్యలు తొలగించుకోవాలని చెప్పింది.
 

న్యూఢిల్లీ: గతేడాది ఆగస్టులో అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్న కూల్చేసి తాలిబాన్లు అధికారాన్ని హస్తగతం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తాలిబాన్ ప్రభుత్వం అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నది. తద్వారా ఫండ్స్ పెద్ద మొత్తంలో పొందవచ్చని తాలిబాన్ ప్రభుత్వం భావిస్తున్నది. కానీ, అక్కడ రోజు రోజుకు పరిస్థితులు మరింత దిగజారుతూనే ఉన్నాయి. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభాలతో కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా బాల్క్ ప్రావిన్స్‌లో కొన్ని కుటుంబాలు రోజు వారీ జీవితాలను కొనసాగిండానికి ఏకంగా పిల్లలనే అమ్మడానికి సిద్ధపడుతున్నాయి. వారి కుటుంబం తీవ్ర పేదరికంలో కూరుకుపోయిందని తెలిసింది.

ఆఫ్ఘనిస్తాన్‌లోని టోలో న్యూస్ శనివారం కీలక కథనం ప్రచురించింది.  బాల్క్ ప్రావిన్స్‌లో ఓ కుటుంబం ఆహారం కోసం కొట్టుమిట్టాడుతున్నది. వారి ఆర్థిక స్థితిని కొంత మెరుగుపరుచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుననది. ఈ ఘటనపై బాల్క్ డిప్యూటీ గవర్నర్ నూరుల్ హాది అబు ఇద్రిస్ స్పందించారు. కొన్ని రోజులుగా తాము రెడ్ క్రాస్ అధికారులతో సమావేశమైనట్టు తెలిపారు. ఈ పేదలకు ఏ రీతిలో సహాయం చేయాలి అనే విషయంపై రెడ్ క్రాస్ అధికారులకు తాము అవగాహన కల్పించినట్టు వివరించారు.

Also Read: ఆఫ్గనిస్తాన్‌లో ఆడపిల్లలకు కొత్త రూల్ : పార్కులు, జిమ్‌లలోకి మహిళలకు నో ఎంట్రీ.. తాలిబన్ల హుకుం

‘నేను నిజంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. తినడానికి ఆహారం లేదు. వినియోగించడానికి ఇంధనం లేదు. చలి కాలం వస్తున్నది. కానీ, దాన్ని ఎదుర్కోవడానికీ నేను సిద్ధంగా లేను. చలి కాలాన్ని ఎదుర్కోవడానికి కనీస షాపింగ్ కూడా చేయలేదు’అంటూ నస్రిన్ అఫ్ఘనిస్తాన్ అధికారుల ముందు కంటనీరు పెట్టుకున్నది. పేదరికంలో కూరుకుపోయిన ఆమె వారి చిన్నారి కూతురును అమ్మేసేయాలని ప్రయత్నించింది.

click me!