russia ukraine crisis: భారతీయ విద్యార్ధుల తరలింపు ముమ్మరం.. పోలండ్ బోర్డర్‌కు చేరుకున్న ఫస్ట్ బ్యాచ్

Siva Kodati |  
Published : Feb 25, 2022, 07:32 PM IST
russia ukraine crisis: భారతీయ విద్యార్ధుల తరలింపు ముమ్మరం.. పోలండ్ బోర్డర్‌కు చేరుకున్న ఫస్ట్ బ్యాచ్

సారాంశం

ఉక్రెయిన్‌లో (ukraine ) చిక్కుకున్న భారతీయ విద్యార్ధులను తరలించేందుకు ప్రయత్నం జరుగుతోంది. డాయిని యూనివర్సిటీకి చెందిన విద్యార్ధులు పోలండ్ బోర్డర్‌కు చేరుకున్నారు. మొదటి విడతగా 40 మంది విద్యార్ధులను పోలండ్ బోర్డర్‌కు తీసుకెళ్లాయి విదేశాంగ శాఖ బృందాలు. 

ఉక్రెయిన్‌లో (ukraine ) చిక్కుకున్న భారతీయ విద్యార్ధులను తరలించేందుకు ప్రయత్నం జరుగుతోంది. డాయిని యూనివర్సిటీకి చెందిన విద్యార్ధులు పోలండ్ బోర్డర్‌కు చేరుకున్నారు. మొదటి విడతగా 40 మంది విద్యార్ధులను పోలండ్ బోర్డర్‌కు తీసుకెళ్లాయి విదేశాంగ శాఖ బృందాలు. పోలండ్‌లోని భారత ఎంబసీ .. వారిని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం అవసరమైన పేపర్ వర్క్‌లో నిమగ్నమయ్యారు సిబ్బంది. 

వీలైనంత త్వరగా వారిని పోలండ్ నుంచి విమానాల్లో భారత్‌కు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు విద్యార్ధులను కూడా పోలండ్ సరిహద్దులకు చేర్చే పనిలో వున్నారు ఎంబసీ సిబ్బంది. అటు రొమేనియాలోనూ భారతీయ విద్యార్ధులను తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. రొమేనియాలోని ఇండియన్ ఎంబసీ తరలింపు ప్రక్రియను ఆపరేట్ చేస్తోంది. ఫస్ట్ బ్యాచ్‌లో కొందరు భారతీయ విద్యార్ధులను రొమేనియా బోర్డర్‌కు తీసుకొచ్చారు. పశ్చిమ ఉక్రెయిన్‌లోని లివియూ, కెర్నివిస్టీవైపు వారి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. 

మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌తీయ‌ వైద్య విద్యార్థులను స్వదేశానికి తిరిగి తీసుక‌రావ‌డానికి  కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి (narendra modi) లేఖ రాసింది. వైద్య విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని వైద్యమండలి కేంద్రాన్ని కోరింది. యువ విద్యార్థులు సురక్షితంగా తిరిగి రావడానికి ప్రాధాన్యత ఇవ్వాలని IMA జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సహజానంద్ ప్రసాద్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు..

ఉక్రెయిన్ లో నెల‌కొన్న‌ ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. వారిలో చాలా మంది విమాన ప్రయాణ ఖర్చులను భరించలేని ప‌రిస్థితిలో ఉన్నారు. స్వంత ఖ‌ర్చుల‌తో ఇత‌ర ప్రాంతాల‌కు వేళ్లే స్థోమత కూడా వారిలో చాలా మందికి లేదు. రోజురోజుకు అక్కడ ప‌తిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. చాలా మంది నిత్య‌వ‌స‌రాలను కొన‌లేని స్థితిలో ఉన్నారు. వారి మనుగడకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత, శ్రేయస్సు గురించి ఆత్రుతగా మరియు ఆందోళన చెందుతున్నారు. అని తెలిపారు

"భారత పౌరులను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్న చ‌ర్య‌లు IMAకి బాగా తెలుసు. ఈ త‌రుణంలో మా యువ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వీలైనంత త్వరగా వారిని తిరిగి తీసుకురావాలని, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని, వారిని బయటకు తీసుకురావడానికి అన్ని విధాలా కృషి చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం" అని లేఖలో పేర్కొన్నారు. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడిని ప్రపంచ వైద్య సంఘం (WMA) కూడా తీవ్రంగా ఖండించింది. అత్యంత దుర్మార్గ చ‌ర్య‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Yearender: 2025 లో భీకర పోరు.. 2026లో ఏం జరగబోతోంది?
Aliens: 2026లో గ్ర‌హాంత‌ర‌వాసులు భూమిపైకి రానున్నారా.? వైరల్ అవుతోన్న వార్తలు