
పుతిన్ ఆదేశాలతో రష్యా సేనలు ఉక్రెయిన్‌పై భీకరదాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు అత్యంత సమీపంలోకి వచ్చినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. రష్యాకు ఉక్రెయిన్ సేనలు కూడా ధీటుగానే బదులిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన ఉక్రెయిన్ బలగాలు దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీని బంకర్‌లోకి తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. తమ అధ్యక్షుడిని కాపాడుకొనేందుకు భద్రతా దళాలు ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది.
అంతకుముందు తాను Ukraine రాజధాని Kviv ను విడిచి వెళ్లినట్టుగా వస్తున్న వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు Zelensky, ప్రకటించారు. తాను దేశం విడిచిపోయినట్టు వవచ్చిన వార్తలను ఆయన ఖండించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలతోనే ఉంటానని జెలెన్ స్కీ ప్రకటించారు. రష్యా దాడుల్ని ఉక్రెయిన్ Army ప్రతిఘటిస్తుందని జెలెన్ స్కీ తెలిపారు. మరోవైపు రష్యా దాడిలో అక్కడ ఇప్పటికే భారీ మొత్తంలో ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. ప్రధానంగా ఉక్రెయిన్ క్యాపిటల్ సీటీ కీవ్ లోని రక్షణశాఖ, సైనిక కార్యాలయాపై రష్యా బలాగాలు బాంబుల వర్షం కురిపించాయి. రష్యా దాడుల్లో బలగాలు, సాధారణ ప్రజలు సహా ఇప్పటికే 137 మంది మంది చనిపోయారని, మరో 316 మంది గాయపడ్డారని చెప్పారు. అయితే విధి లేని పరిస్థితిలో ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగింది.
ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ .. భావోద్వేగానికి గురయ్యారు. యుద్ధంలో ఒంటరైపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి ఎలాంటి సాయాన్ని ఆశించవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, తాము మాత్రం రష్యాను చూసి భయపడట్లేదని, పోరాడుతామని, దేశాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. రష్యా దాడికి బెదిరేది లేదంటున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలొంస్కీ. రష్యా దాడులను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ప్రపంచదేశాలు తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో 10 రష్యా యుద్దవిమానాలను , హెలికాప్టర్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే తాము ఒక్క యుద్ద విమానాన్ని కూడా కోల్పోలేదని ఉక్రెయిన్ అసత్య ప్రచారం చేస్తుందని రష్యా పేర్కొంది.
తాజాగా.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ (Sergey Lavrov) సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ సైన్యం తక్షణమే యుద్దం ఆపాలి. ఉక్రెయిన్ సైన్యం తన చేతుల్లోని ఉన్న ఆయుధాలను వదిలేయాలి. ఆపై రష్యా సైన్యానికి లొంగిపోవాలి. ఉక్రెయిన్ సైన్యం మొత్తం రష్యా సైన్యానికి లొంగిపోయాలి. ఆ తర్వాత ఉక్రెయిన్ ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ చెప్పారు. మరి ఈ ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎలా స్పందిస్తారో చూడాలి.