కమెడియన్ నుంచి ప్రెసిడెంట్ వరకు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆసక్తికర ప్రస్థానం

Published : Feb 25, 2022, 06:55 PM ISTUpdated : Feb 25, 2022, 06:57 PM IST
కమెడియన్ నుంచి ప్రెసిడెంట్ వరకు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆసక్తికర ప్రస్థానం

సారాంశం

ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ ఒక కమెడియన్‌గా గతంలో పని చేశారు. ఆ తర్వాత ఆయన కమెడియన్ నుంచి బయటపడి.. రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన జీవితానికి చెందిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి.  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine) ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నది. ప్రపంచంలో అధిక మిలిటరీ(Military) సంపద ఉన్న దేశాల్లో రష్యా(Russia) తప్పక ఉంటుంది. ఇప్పుడు ఆ రష్యా దేశం ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నది. ఈ కఠోర పరిస్థితుల్లో ఉక్రెయిన్ దేశానికి సారథ్యం వహిస్తున్న అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ(Volodymyr Zelensky) చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన ఒక కమెడియన్ నుంచి దేశ అధ్యక్షుడిగా ఎదగడం వెనుక ఆశ్చర్యకర వాస్తవాలు ఉన్నాయి.

44 ఏళ్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ తన పాపులారిటీ.. ప్రజల్లో తనపై ఉన్న మక్కువతో జెలెన్‌స్కీ దేశానికి అధ్యక్షుడు అయ్యారు. కానీ, దేశ రాజకీయాలు, అధ్యక్షుడిగా ఆయనకు అన్నీ కొత్తే. తగిన అనుభవం ఆయనకు లేదు. 

జెలెన్‌స్కీ సెంట్రల్ సిటీ క్రివి రిలోని ఓ యూదు కుటుంబంలో జన్మించారు. కీవ్ నేషనల్ ఎకనామిక్ యూనివర్సిటీలో ఆయన న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. అయితే, ఆయన మాత్రం చదువుతో సంబంధం లేకుండా కమెడియన్ అయ్యారు. ఆయన కాలేజీ రోజుల నుంచే కామెడీపై ఆసక్తి పెంచుకున్నాడు. యుక్త వయసులోనే రష్యన్ టీవీలో ప్రసారం అయ్యే కామెడీ షోల వారి టీమ్‌లో తప్పక భాగస్వామ్యం పంచుకునేవారు. 2003లో ఆయన ఓ టీవీ ప్రొడక్షన్ కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఆ కంపెనీ వన్ ప్లస్ వన్ అనే నెట్‌వర్క్‌కు షోలు వేసేది. 2012 వరకు ఆయనకు టీవీ షోలు, సినిమాలపైనే ఆయన ఆసక్తి అంతా ఉండేది. 

2014లో ఆయన జీవితంలో అనూహ్య మలుపు తిరిగింది. జెలెన్‌స్కీ జీవితంలోనే కాదు.. ఉక్రెయిన్‌ కూడా కీలక మలుపు తిరిగింది. రష్యా అనుకూల అధ్యక్షుడు ఆందోళనల నేపథ్యంలో గద్దె దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత రష్యా.. ఉక్రెయిన్‌లోని క్రిమియాను ఆక్రమించుకుంది. అక్కడి వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చింది. ఈ మద్దతు ఇప్పటికీ కొనసాగుతున్నది. కాగా, అదే సంవత్సరంలో జెలెన్‌స్కీ సర్వెంట్ ఆఫ్ వి పీపుల్ అనే షో చేశాడు. ఈ షోతో జెలెన్‌స్కీ ఉన్నట్టుండి ఒక్కసారిగా సెలెబ్రిటీ అయిపోయాడు. దుర్భాషలాడే ఓ టీచర్ అధ్యక్షుడిగా మారడమే ఆ షో కథ. అవినీతిపై టీచర్ దుర్భాషలాడుతుంటే.. ఓ విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తారు. ఆ వీడియోతో అందరి దృష్టి ఆ టీచర్‌పై పడుతుంది. స్థూలంగా ఇదీ కథ. ఈ కామెడీ షో పెద్ద హిట్ అయింది. క్రిమియా ఆక్రమణ, దాని అనంతర పరిణామాలు, సంక్షోభాలతో ఉక్రెయిన్ తల్లడిల్లుతున్న కాలం అది. అప్పుడు జెలెన్‌స్కీ కామెడీ షో సరిగ్గా రాజకీయాలను హేళన చేస్తూ సరిగ్గా సరిపోయింది.

రీల్ లైఫ్‌లో చాలా కాలం అధ్యక్షుడిగా చేసిన జెలెన్‌స్కీ నిజ జీవితంలోనూ అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అధ్యక్ష బరిలో ఉన్న బిజినెస్‌మెన్ పెట్రో పొరొషెంకోను ఢీకొట్టి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని నిశ్చయించుకున్నారు.

జెలెన్‌స్కీ తాను అధ్యక్ష బరిలోకి దిగిన తర్వాత సీరియస్ అంశాలపై చర్చించడం మానేశాడు. కేవలం ఉల్లాసపరిచే తేలికపాటి కామిక్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి కూడా క్యాన్వాసింగ్ చేశారు. ఇతర మార్గాల్లోనూ ఆయన ప్రచారం చేసుకున్నారు. పెట్రో పొరొషెంకోపై 70 ఓట్లు పొంది గెలిచాడు. ఇప్పుడు ఆ వొలొడిమిర్ జెలెన్‌స్కీ.. ప్రపంచంలో అధిక సైనిక బలగం ఉన్న ఒక దేశం రష్యాను ఎదుర్కొంటున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ గూఢచారి నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన సంగతి తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Yearender: 2025 లో భీకర పోరు.. 2026లో ఏం జరగబోతోంది?
Aliens: 2026లో గ్ర‌హాంత‌ర‌వాసులు భూమిపైకి రానున్నారా.? వైరల్ అవుతోన్న వార్తలు