
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మెక్సికో నగరాన్ని ప్యూబ్లా (Puebla) నగరంతో కలిపే హైవే పై జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక అధికారులు వివరాలు వెల్లడించారు. టోల్ బూత్ వద్ద ఉన్న వాహనాలపైకి.. ఓ భారీ ట్రక్ దూసుకొచ్చింది. బ్రేక్‌లు పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వాహనాలను ట్రక్కు ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో.. పలు వాహనాలు దగ్దమయ్యాయి.
Also read: ఆయిల్ ట్యాంకర్ పేలి 92 మంది దుర్మరణం.. మరో 30 మంది పరిస్థితి విషమం
"టోల్ బూత్‌ను దాటుతున్నప్పుడు, ట్రక్ ఆరు వాహనాలను ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. మరణించిన వారిలో ట్రక్కు డ్రైవర్ కూడా ఉన్నారు" అని ఆ దేశ ఫెడరల్ హైవే అథారిటీ, CAPUFE శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్టుగా అధికారులు వెల్లడించారు.
Also read: ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి.. హత్యాయత్నంగా పేర్కొన్న మిలటరీ..
ఈ ప్రమాదంలో దగ్దమైన వాహనాలను అక్కడి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టినట్టుగా అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన భాగం వరకు ట్రాఫిక్‌ను అనుమతించడం లేదని చెప్పారు. కాగా, ఈ హైవేపై ఎక్కువగా భారీ ట్రక్కులు రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్పారు.