ఇండోనేషియా సునామి విధ్వంసం: 172కు చేరిన మృతుల సంఖ్య

By Arun Kumar PFirst Published Dec 23, 2018, 1:45 PM IST
Highlights

ఇండోనేషియాలో శనివారం రాత్రి సునామీ సృష్టించిన విద్వంసం కారణంగా మృతిచెందినవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ ప్రకృతి విపత్తు దాటికి 172 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అలాగే మరో 1000మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్లు వెల్లడిచారు.

సునామీ విద్వంసాన్ని చవిచూసిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతదేహాలు లభిస్తున్నాయి. శిథిలాల కింద, బురదలో కూరుకుపోయిన, రాకాసి అలల దాటికి సముద్రంలో కొట్టుకుపోయిన మృతదేహాలు ఒక్కోటిగా బయటపడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. 

 ఈ సునామీ ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్‌, దక్షిణ లాంపంగ్‌ ప్రాంతాలపై తన ప్రతాపాన్ని చూపింది. ముఖ్యంగా దక్షిణ సుమత్రా, పశ్చిమ జావా దీవుల్లో సునామీ వచ్చినట్లు అధికారులు తెలిపారు. సునామీ కారణంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు తీర ప్రాంతంలోని వందలాది భవనాలు తీవ్రంగా దెబ్బతీశాయి.ఈ అలల దాటికి కొంతమంది సముద్రంలో గల్లంతయ్యారని సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు తెలిపారు.  

 సునామీ దాటికి గురైన ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ సునామీ కారణంగా ప్రాణనష్టమే కాకుండా భారీగా ఆస్తి నష్టం  సంభవించించినట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు 

ఇండోనేషియాలో సునామీ...62 మంది మృతి
  
click me!