సహాయం కోసం 911కి కాల్ చేసిన 11 ఏళ్ల బాలుడు.. ఇంటికొచ్చి కాల్పులు జరిపిన పోలీస్...

By SumaBala BukkaFirst Published May 26, 2023, 1:29 PM IST
Highlights

డొమెస్టిక్ వాయలెన్స్ నుంచి రక్షణ నుంచి సహాయం కోసం.. 911కి ఓ 11యేళ్ల బాలుడు ఫోన్ చేశాడు. వచ్చిన పోలీస్ ఆ బాలుడి మీదే కాల్పులు జరిపాడు. 

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని మిస్సిస్సిప్పి రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సహాయం కోసం 911 ఎమర్జెన్సీ టెలిఫోన్ నంబర్‌కు కాల్ చేసిన 11 ఏళ్ల బాలుడిపై..అతని ఇంట్లోనే పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఆ చిన్నారిని ఆ తరువాత ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.  ప్రస్తుతం డిశ్చార్జ్ అయిన బాలుడు.. గాయాల నుండి నయం అవుతున్నాడు.

గాయాలపాలైన బాలుడిని అడెర్రియన్ ముర్రీగా గుర్తించారు. అతని కుటుంబం ఆ అధికారిని తొలగించాలని, కాల్పులకు పాల్పడినట్లు అభియోగాలు మోపాలని కోరారు.  "శనివారం తెల్లవారుజామున ఇండియోనాలా పోలీసు డిపార్ట్‌మెంట్ అధికారి అడెర్రియన్ ఛాతీపై కాల్చాడు. పిల్లల ఇంట్లోనుంచి డొమెస్టిక్ డిస్ట్రబెన్స్ కు సంబంధించిన కాల్‌కు ప్రతిస్పందనగా అతను వచ్చాడు" అని బాలుడి తల్లి నకలా ముర్రీ చెప్పారు.

ముర్రీ ఆ ఘటన పరిస్థితిని వివరిస్తూ.. తన మరో పిల్లాడి తండ్రి శనివారం తెల్లవారుజామున 4 గంటలకు కోపంతో తన ఇంటికి వచ్చాడని చెప్పారు. అది చూసి భద్రత గురించి ఆందోళన చెందిన ముర్రీ.. కొడుకు అడెర్రియన్‌ను పోలీసులకు కాల్ చేయమని కోరింది.

భర్త చిత్రహింసలు పెడుతున్నాడని భార్య మాస్టర్ ప్లాన్.. నిద్రమాత్రలతో బిస్కెట్లు చేసి.. చివరికి...

ఆ కాల్ అందుకున వచ్చిన పోలీసు ముందుతలుపు మీద తుపాకీతో గీరాడు. ఆ తరువాత "ఇంట్లో ఉన్నవారిని బయటికి రమ్మని అడిగాడు" అని ఆమె తెలిపింది. తన కొడుకు హాలులోంచి బయటకు రాగానే అతని మీద కాల్పులు జరిపాడు.. అని ఆమె తెలిపింది.

"అదే పోలీసు అతన్ని ఇంటి నుండి బయటకు రమ్మని చెప్పాడు. అడెర్రియన్ అతను చెప్పిందే చేసాడు. అయినా, అతని మీద కాల్పులు జరిపాడు. అదే నేను  అర్థం చేసుకోలేకపోతున్నాను. అడెర్రియన్ కూడా అతను నన్ను ఎందుకు కాల్చాడు? నేనేం తప్పు చేసాను" అని అడుగుతూనే ఉన్నాడు" అని ఆమె చెప్పింది.

మరో కథనం ప్రకారం, బాడీ కెమెరా ఫుటేజ్ ఇంకా వెలుగులోకి రాలేదు. బాడీ కెమెరా ఫుటేజ్ కోసం అభ్యర్థించామని..  "కొనసాగుతున్న దర్యాప్తు" కారణంగా తిరస్కరించబడిందని న్యాయవాది పేర్కొన్నారు. ఈ ఘటనలో పాల్గొన్న అధికారి గ్రెగ్ కేపర్స్ అని ఇండియానోలా పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
 

click me!