భర్త చిత్రహింసలు పెడుతున్నాడని భార్య మాస్టర్ ప్లాన్.. నిద్రమాత్రలతో బిస్కెట్లు చేసి.. చివరికి...

By SumaBala Bukka  |  First Published May 26, 2023, 10:58 AM IST

భర్త పెట్టే చిత్రహింసలనుంచి తప్పించుకోవడానికి భార్య వేసిన స్కెచ్ తో అతను మరణించాడు. అయితే అతని మృతికి కారణమేంటో వైద్యులు కూడా కనిపెట్టలేకపోతున్నారు. 


ఆస్ట్రేలియా : కాపురంలో కలహాలు మామూలే.. అయితే, అవి శృతి మించితే..  భర్తను భార్య.. భార్యను భర్త  హత్య చేసుకోవడం వరకు దారితీస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగానే వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితే ఓ భార్యకు ఎదురయింది. తనను చిత్రహింసలకు గురి చేస్తున్న భర్తను వదిలించుకోవాలని ఆమె మాస్టర్ ప్లాన్ వేసింది. అయితే, చంపిన తర్వాత కూడా తాను దొరకకుండా ఉండాలని వేసిన ఆమె మాస్టర్ ప్లాన్ తో పోలీసులు హత్యకు కారణం ఏంటో తెలుసుకోలేకపోయారు. ఆ తర్వాత వెలుగు చూసిన విషయాలు వారిని ఆశ్చర్యానికి గురిచేసాయి. ఇక్కడ దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో నోయల్ పేన్, రెబెక్కా అనే దంపతులు ఉండేవారు. నోయల్ ఓ శాడిస్ట్. నిత్యం రెబక్కాను కొట్టడం, తిట్టడం,  అత్యాచారానికి పాల్పడడం లాంటి వాటితో ఆమెకు ప్రత్యక్షనరకం చూపించేవాడు. ఇవన్నీ కాదన్నట్టు ఓ రోజు  ఓ కొత్త మహిళను ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెను తన గర్ల్ ఫ్రెండ్ గా రెబెక్కాకు పరిచయం చేశాడు. ఆ రోజు నుండి ఆమె కూడా వారితో పాటే ఉంటుందని చెప్పాడు. అది విన్న రెబెక్కాకు ఏం చేయాలో అర్థం కాలేదు. 

Latest Videos

జపాన్ లో నలుగురిని కాల్చి చంపిన నిందితుడి అరెస్టు.. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు

ఎదురు తిరిగితే భర్త పెట్టే చిత్రహింసలు గుర్తుకు వచ్చి.. నోరు మూసుకుంది. కొద్ది రోజులకు నోయల్ రెబెకా తో పాటు కొత్తగా తీసుకొచ్చిన అమ్మాయి మీద కూడా అత్యాచారం చేయడం, హింసించండం మొదలుపెట్టాడు. అతని చర్యలు, పెట్టే చిత్రహింసలు ఆమెను నిద్రలో కూడా వణికి పోయేలా చేసేవి. అతన్ని ఎలాగైనా బదిలించుకోవాలనుకుంది. బతికుండగా.. వదిలించుకోవడం సాధ్యం కాదని ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. నిద్ర మాత్రలను తీసుకొచ్చి.. వాటిని ఐసింగ్ షుగర్ లా మార్చింది. వాటితో బిస్కెట్లు తయారుచేసి భర్తకు పెట్టింది. 

బిస్కెట్లు తిన్న తర్వాత నిద్రలోకి జారిపోవడంతో..  తమకు హింస తప్పుతుందని అనుకుంది. కానీ ఆమె అనుకున్నట్టు జరగలేదు. బిస్కెట్లు తిన్న అతను నిద్రలోకి జారిపోవడం కాకుండా స్పృహ తప్పిపోయాడు. అది చూసిన ఆమె చనిపోయాడేమో అనుకుని భయపడింది. అతన్ని ఇంట్లో ఉన్న ఫ్రిజ్లో దాచి పెట్టింది. అయితే, విషయం దాగదు కదా. అతను మరణించిన విషయం వెలుగు చూసింది. అతడు ఎలా చనిపోయాడని విషయం మీద పోలీసులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు.

నోయల్  ఫ్రిజ్లో ఉంచడం వల్ల చనిపోయాడా? లేక నిద్ర మాత్రలు కలిపిన బిస్కెట్లు తినడం చనిపోయాడా? అనేది తెలియట్లేదు. ఏదేమైనా అతని హత్యకు కారణం రవికానే అని అనుమానించిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.  అక్కడ ఆమె తన భర్త చేతిలో అనుభవించిన చిత్రహింసల గురించి కోర్టుకు వివరించింది. అది విన్నకోర్టు షాక్ అయింది.

అసభ్యకర వీడియోలు చూడమని రెబెక్కాను బలవంతం చేయడం.. చెప్పినట్టు వినకపోతే సిగరెట్ తో కాల్చడం.. ఆమె మీద పదేపదే ఉమ్మడం.. లాంటి అనేక మానసిక, శారీరక చిత్రహింసలకు గురి చేసేవాడని  ఆధారాలతో సహా తెలిపింది. ఎంతోమంది అమ్మాయిల మీద అత్యాచారం చేశాడని  చెప్పింది.

అంతేకాదు అమ్మాయిలు అంటే అతని దృష్టిలో కేవలం వస్తువులు మాత్రమే అని.. వారిని ఎప్పుడు ఆట బొమ్మలుగా మాత్రమే చూసేవాడని చెప్పింది. అయితే కారణమేదైనా భర్తను చంపిన కేసులో రెబెకాకు జీవితఖైదు పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. 

click me!