DRDO: డీఆర్‌డీవో మిస్సైల్‌ పరీక్ష విజయవంతం... రక్షణ వ్యవస్థ బలోపేతం!

DRDO: ఇండియన్‌ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) స్క్రామ్‌జెట్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్‌ను 1,000 సెకన్ల నిర్వహించి కీలకమైన టార్గెట్‌ను చేరుకుంది. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక స్క్రామ్‌జెట్ కనెక్ట్ టెస్ట్ ఫెసిలిటీలో వద్ద సుమారు 1,000 సెకన్లకు పైగా వ్యవధిలో యాక్టివ్ కూల్డ్ స్క్రామ్‌జెట్ సబ్‌స్కేల్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్‌ నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Google News Follow Us

ఇండియన్‌ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) స్క్రామ్‌జెట్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్‌ను 1,000 సెకన్ల నిర్వహించి కీలకమైన టార్గెట్‌ను చేరుకుంది. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక స్క్రామ్‌జెట్ కనెక్ట్ టెస్ట్ ఫెసిలిటీలో వద్ద సుమారు 1,000 సెకన్లకు పైగా వ్యవధిలో యాక్టివ్ కూల్డ్ స్క్రామ్‌జెట్ సబ్‌స్కేల్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్‌ నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ పరీక్ష విజయవంతం కావడంతో  హైపర్‌ సోనిక్‌ వెపన్‌ టెక్నాలజీలో ఒక అడుగు ముందుకు వేసినట్లు తెలిపారు. మండించడానికి వీలుండే ఇలాంటి వ్యవస్థలు దీర్ఘకాలిక క్రూయిజ్ లక్ష్యాలను నెరవేర్చేందుకు ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక స్క్రామ్‌జెట్ కంబస్టర్ పరీక్షతో హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి బలమైన పునాదికి నాంది పలికిందని డీఆర్‌డీవో పేర్కొంది.

ఇటీవల ఓ దఫాగ్రౌండ్ టెస్ట్ జనవరిలో నిర్వహించగా.. కేవలం 120 సెకన్ల పాటు పరీక్ష కొనసాగింది. రీసెంట్‌గా రూపొందించిన స్క్రామ్‌జెట్ కంబస్టర్‌తో దాదాపు వెయ్యి సెకన్లుపాటు పరీక్ష కొనసాగింది. ఇక దేశంలో ఈ రకమైన మొట్టమొదటి గ్రౌండ్ టెస్ట్‌గా గుర్తింపు తెచ్చింది. హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రొపల్షన్ కోసం గాలి తీసుకునే ఇంజిన్‌ను ఉపయోగించి మాక్ 5 కంటే ఎక్కువ వేగంతో 6,100 కి.మీ.కు పైగా ఎగరగల ఒక రకమైన వెపన్ అని చెప్పవచ్చు. 

తాజాగా విజయవంతమైన పరీక్షతో దేశంలో హైపర్‌సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేయడంలో కీలకమైన మైలురాయిని చేరుకున్నట్లు డీఆర్‌డీవో ప్రకటించింది. సూపర్‌సోనిక్ కు మండి స్వభావం కలిగి ఉండటంతో దీర్ఘకాలికంగా కీలక పాత్ర పోషిస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అద్భుతమైన విజయం" సాధించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. డీఆర్‌డీవో, పరిశ్రమ భాగస్వాములను పలు విద్యా  సంస్థలను ఆయన ప్రశంసించారు. దేశానికి కీలకమైన హైపర్‌సోనిక్ ఆయుధ సాంకేతికతలను సాకారం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి ఈ విజయం ఓ ఉదాహరణ అని అన్నారు. 

"అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 1,000 సెకన్లకు పైగా సూపర్‌సోనిక్ మండేలా చేసినందుకు డైరెక్టర్ జనరల్ (క్షిపణులు వ్యూహాత్మక వ్యవస్థలు) రాజాబాబు, డిఆర్‌డిఎల్ డైరెక్టర్ జిఎ శ్రీనివాస మూర్తి మరియు మొత్తం బృందాన్ని రక్షణ శాఖ పరిశోధన మరియు అభివృద్ధి కార్యదర్శి మరియు డిఆర్‌డిఓ చైర్మన్ సమీర్ వి కామత్ అభినందించారు.

Read more Articles on