‘‘ధోని విషయంలో కోహ్లీ నిర్ణయమే ఓటమికి కారణం’’

By telugu teamFirst Published Jul 11, 2019, 11:23 AM IST
Highlights

ప్రపంచకప్ లో టీం ఇండియా ఓడిపోవడాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కచ్చితంగా టీం ఇండియాదే వరల్డ్ కప్ అని అందరూ భావించిన క్రమంలో...  సెమీ ఫైనల్స్ లో ఓడిపోవడం కలిచివేసింది. 


ప్రపంచకప్ లో టీం ఇండియా ఓడిపోవడాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కచ్చితంగా టీం ఇండియాదే వరల్డ్ కప్ అని అందరూ భావించిన క్రమంలో...  సెమీ ఫైనల్స్ లో ఓడిపోవడం కలిచివేసింది. కాగా... ఈ ఓటమిపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పందించారు.

సెమిస్ లో ఓడిపోవడం చాలా బాధ కలిగించిందని సచిన్ అన్నారు. అయితే... భారీ ఓటమి నుంచి జడేజా, ధోనీలు బయటపడేశారని ఆయన పేర్కొన్నారు. ధోనీ క్రీజులో ఉన్నంత సేపు టీం ఇండియా కంట్రోల్ లోనే ఉందన్నారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ జడేజాతో హిట్టింగ్ చేపించాడని ప్రశంసలు కురిపించాడు. జడేజా కెరీర్ లోనే ఇది బెస్ట్ ఇన్నింగ్స్ గా నిలుస్తాయన్నారు. 

‘అయితే ఐదో స్థానంలో హార్దిక్‌ పాండ్యా బదులు ధోని బ్యాటింగ్‌కు రావాల్సింది. ధోని ఎక్కువ సేపు బ్యాటింగ్‌ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. ఈ విషయంలో మేనేజ్‌మెంట్‌ పొరపాటు చేసిందని బావిస్తున్నా’అంటూ సచిన్‌ పేర్కొన్నాడు. ఈ విషయంలో అభిమానులు కూడా పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ధోనీని ముందే స్టేడియంలోకి పంపించి ఉంటే... కచ్చితంగా విజయం సాధించేవాళ్లమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయమే జట్టు కొంపముంచిందని అభిమానులు భావిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా... న్యూజిలాండ్ తో  జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో కేవలం 18పరుగుల తేడాతో టీం ఇండియా ఓటమిపాలైనసంగతి తెలిసిందే.

click me!