టీమిండియా ఓటమి...తట్టుకోలేక కన్నుమూసిన అభిమాని

Published : Jul 11, 2019, 10:34 AM IST
టీమిండియా ఓటమి...తట్టుకోలేక కన్నుమూసిన అభిమాని

సారాంశం

ప్రపంచకప్ లో భారత్ పోరు ముగిసింది. బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఓటమి పాలయ్యింది. 

ప్రపంచకప్ లో భారత్ పోరు ముగిసింది. బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఓటమి పాలయ్యింది. కాగా... భారత్ ఓటమి పాలవ్వడాన్ని ఓ అభిమాని తట్టుకోలేకపోయాడు. టీవీలో మ్యాచ్ చూస్తూనే గుండె నొప్పితో కుప్పకూలాడు. ఈ విషాదకర సంఘటన విజయనగరంలో చోటుచేసుకుంది.

పూసపాటిరేగ మండలం రెల్లివలసకు చెందిన మీసాల రాము(35) ఎంవీజీఆర్‌ కళాశాలలో టెక్నీషియన్‌.  బుధవారం సాయంత్రం వరకు తోటి ఉద్యోగులందరితోను సరదాగా గడిపిన అతను అనంతరం టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ ఉత్కంఠకు లోనయ్యాడు. భారత్‌ ఓటమి అంచుకు చేరగా ఒత్తిడికి లోనై టీవీ చూస్తుండగానే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. రాముకు భార్య ప్రమీల, రెండేళ్ల కుమారుడు వున్నారు.  మృతదేహాన్ని స్వగ్రామమైన రెల్లివలసకు రాత్రి 10 గంటల సమయంలో తీసుకువచ్చారు.  

PREV
click me!

Recommended Stories

కప్ పోయిందన్న బాధ ముఖంపై లేదు: విలియమ్సన్‌పై సచిన్ ప్రశంస
ప్రపంచకప్ హీరోలకు ర్యాంకుల పంట, టాప్ ప్లేస్‌ కోహ్లీదే..!!