జడేజా బ్యాటింగ్ కి మంజ్రేకర్ స్పందన ఇదే..

Published : Jul 11, 2019, 08:28 AM ISTUpdated : Jul 11, 2019, 10:00 AM IST
జడేజా బ్యాటింగ్ కి మంజ్రేకర్ స్పందన ఇదే..

సారాంశం

సెమీ ఫైనల్స్ లో టీం ఇండియా కి పరాజయం ఎదురైంది. టీం ఇండియా టాప్ ఆర్డర్ మొత్తం కూలిపోవడంతో మొదటే అందరూ ఆశలు వదులుకున్నారు

సెమీ ఫైనల్స్ లో టీం ఇండియా కి పరాజయం ఎదురైంది. టీం ఇండియా టాప్ ఆర్డర్ మొత్తం కూలిపోవడంతో మొదటే అందరూ ఆశలు వదులుకున్నారు. కనీసం వంద కూడా స్కోర్ చేయకుండానే టీం ఇండియా ఆల్ అవుట్ అయిపోతారని అందరూ భావించారు. కానీ... కాస్తో కూస్తో చివరిదాకా జట్టు ఆశలు చివరిదాకా కాపాడింది రవీంద్ర జడేజానే. ఒంటిచేత్తో జట్టు పరువు కాపడటానికి శాయశక్తులా ప్రయత్నించాడు. కాగా.. జడేజా బ్యాటింగ్ పై తాజాగా మాజీ క్రికెటర్, కామెంటేటర్ మంజ్రేకర్ స్పందించారు.

గతంలో జడేజాను కించపరిచేలా మాట్లాడినే మంజ్రేకరే... ఇప్పుడు పొగడ్తల వర్షం కురిపించాడు. బాగా ఆడావు జడేజా అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. కివీస్‌తో జరిగిన కీలక పోరులో బాగా ఆడాడని మ్యాచ్‌ అనంతరం మెచ్చుకున్నాడు. గత 40 ఇన్నింగ్స్‌లలో జడేజా చేసిన అత్యధిక పరుగులు 33 మాత్రమేనని, ఇదివరకెన్నడూ ఇలాంటి జడేజాని చూడలేదని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.

కాగా... కొద్దిరోజుల క్రితమే.. ‘జడేజా స్మార్ట్‌ గల్లీ క్రికెటర్‌’ అంటూ మంజ్రేకర్ కామెంట్ చేశాడు. దానికి మొన్న మాటలతో అప్పుడే బదులిచ్చిన జడేజా.. తాజాగా తన బ్యాటింగ్ తో బదులిచ్చాడు. అర్థసెంచరీ చేసిన అనంతరం జడేజా తన బ్యాట్ పైకి ఎత్తి చూపించాడు. అయితే.. అది కేవలం మంజ్రేకర్ కి సమాధానం చెప్పడానికే ఇలా చేశాడని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

కప్ పోయిందన్న బాధ ముఖంపై లేదు: విలియమ్సన్‌పై సచిన్ ప్రశంస
ప్రపంచకప్ హీరోలకు ర్యాంకుల పంట, టాప్ ప్లేస్‌ కోహ్లీదే..!!