బాలాపూర్ లడ్డు కొనుగోలుకు వైఎస్ జగన్ సహాయకుడి విఫలయత్నం

By telugu teamFirst Published Sep 13, 2019, 9:03 AM IST
Highlights

బాలాపూర్ లడ్డుకు వేలం పాటలో ఉండే పోటీ అందరికీ తెలిసిందే. బాలాపూర్ లడ్డును సొంతం చేసుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఆ లడ్డును సొంతం చేసుకోవడానికి ఎపి సిఎం వైఎస్ జగన్ సన్నిహితుడొకరు ప్రయత్నించి విఫలమయ్యారు.

హైదరాబాద్: బాలాపూర్ వినాయకుడి లడ్డును సొంతం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు జీవికే రెడ్డి విఫలయత్నం చేశారు. జీవీకె రెడ్డి జగన్ స్వస్థలం పులివెందులకు చెందినవారు. బాలాపూర్ లడ్డును సొంతం చేసుకోవాలనే జీవీకె రెడ్డి కల ఫలించలేదు.

బాలాపూర్ లడ్డును సొంతం చేసుకోవడానికి విపరీతమైన పోటీ ఉంటుంది. దాన్ని వేలంలో పాడుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. జీవికె రెడ్డి తొలుత 16 లక్షల రూపాయలకు పాడాడు. దాని ధర రూ.17.41 వరకు వెళ్లే దాకా పోటీ పడ్డారు. 

చివరకు బాలాపూర్ గ్రామానికి చెందిన కొలను రాంరెడ్డి రూ.17.41 లక్షలకు పాడుడుకున్నారు. బాలాపూర్ లడ్డు వేలం పాటలో స్థానికులు మాత్రమే కాకుండా స్థానికేతరులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. జీవీకె రెడ్డి వేలం పాటలో పాల్గొన్నప్పటికీ ఫలితం దక్కలేదు.

గణేశుడిని నిమజ్జనం గురువారంనాడు హైదరాబాదులో కోలాహలంగా జరిగింది. వినాయకుడిని నిమజ్జనానికి బయలుదేరదీసే ముందు లడ్డులు వేలం వేస్తారు. 

సంబంధిత వార్తలు

రూ.17.60 లక్షలకు బాలాపూర్ లడ్డు దక్కించుకొన్న కొలను రాంరెడ్డి

గణేష్ నిమజ్జనం: బాలాపూర్ లడ్డు వేలం చరిత్ర ఇదీ...

ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర

click me!