Hyderabad: కార్పొరేట్‌ కాలేజీలో ఫుడ్‌ పాయిజనింగ్‌.. 60 మంది విద్యార్థులకు అస్వస్థత

Telangana Food Poisoning: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన కాలేజీలో 60 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. కాలేజీ క్యాంపస్ లో ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించారు.. 


రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరులోని ఇంటర్ కాలేజీ క్యాంపస్‌లో రాత్రి భోజనం చేసిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారని పోలీసులు సోమవారం తెలిపారు. 
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, "నిన్న రాత్రి కుంట్లూరులోని నారాయణ కాలేజీలో విద్యార్థులు ఆలూ కుర్మా, చపాతీ తిన్న తర్వాత జబ్బు పడ్డారని మాకు సమాచారం అందింది. కానీ, కాలేజీ యాజమాన్యం వాళ్ళు బాగానే ఉన్నారని చెప్పారు. తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి మాకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు, ఒకవేళ వస్తే తగిన చర్యలు తీసుకుంటాం." అని తెలిపారు. 

ఆదివారం రాత్రి భోజనం చేసిన దాదాపు సగం మంది విద్యార్థులకు వాంతులు అవ్వడం వంటి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించాయి. 

Latest Videos

అర్థరాత్రి తర్వాత చాలా మంది విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో వారిలో కొంతమందికి వైద్య సహాయం అవసరమైందని, కాలేజీ క్యాంపస్‌లో 800 నుంచి 900 మంది విద్యార్థులు ఉండగా. వారిలో దాదాపు సగం మంది జబ్బు పడ్డారని సమాచారం. 

ఈ సంఘటనతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు, ఫుడ్ పాయిజనింగ్‌కు గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. .

ఈ విషయమై ఓ విద్యార్థిని మీడియాతో మాట్లాడుతూ.. 'ఆదివారం రాత్రి భోజనం తర్వాత వాంతులు అయ్యాయి. కొంతమంది అర్ధరాత్రి నుంచి జబ్బు పడ్డారు. దాదాపు సగం క్యాంపస్ జబ్బు పడింది. క్యాంపస్‌లో మొత్తం 800 నుంచి 900 మంది ఉన్నారు," అని తెలిపారు.ఇదిలాఉంటే.. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ క్యాంపస్‌లో భోజనం చేసిన తర్వాత 18 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. 

జడ్చర్ల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రకారం, ఈ సంఘటన జడ్చర్ల పట్టణంలోని విలే పార్లే కేల్వాని మండల్ (ఎస్వీకేఎం) నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎన్‌ఎంఐఎంఎస్) క్యాంపస్‌లో జరిగింది. క్యాంపస్‌లో భోజనం చేసిన తర్వాత విద్యార్థులు జబ్బు పడ్డారని, దీంతో యాజమాన్యం మొదట డాక్టర్లను పిలిపించి క్యాంపస్‌లోనే వారికి చికిత్స అందించారని అధికారి తెలిపారు. ఇక అంతకు ముందు తెలంగాణలో పలు ప్రభుత్వ హాస్టళ్లలో జరిగిన ఫుడ్ పాయిజన్ కేసులు ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. 

click me!