భర్త, పిల్లలు ఉండగానే మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ

Published : Nov 18, 2019, 08:09 AM IST
భర్త, పిల్లలు ఉండగానే మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ

సారాంశం

భర్త, పిల్లలు ఉండగానే హైదరాబాదులో ఓ మహిళ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. భర్తతో విడాకులు పొందకుండా ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దానిపై భర్త అశోక్ తన భార్య జ్యోతిశ్వరిపై కేసు పెట్టాడు.

హైదరాబాద్: హైదరాబాదులో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇరవై ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, అతనితో పుట్టిన బిడ్డలను వదిలేసి మహిళ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 

ఆమెకు ఇంటర్మీడియట్ చదువుతున్న కుమారుడు, 15 ఏళ్ల కూతురు ఉన్నారు. హైదరాబాదులోని కృష్ణానగర్ కు చెందిన అశోక్, జ్యోతీశ్వరి రెండు దశాబ్దాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 18 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కూతురు ఉన్నారు. 

అయితే, జ్యోతిశ్వరి 2016లో ఖమ్మం జిల్లాకు చెందిన వేణుగోపాల రావుతో ప్రేమలో పడింది. దాంతో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. విడిపోవాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయం మేరకు హైదరాబాదు సిటీ సివిల్ కోర్టులో విడాకులకు దరఖాస్తు పెట్టుకున్నారు. 

అయితే, విడాకులు పొందకుండానే జ్యోతీశ్వరి వేణుగోపాల రావును వివాహం చేసుకుంది. ఇది చట్ట విరుద్ధమని అశోక్ హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...