డ్రైవర్‌గా మారిన దొంగ: యజమానికి మస్కా.. కొత్త వోల్వో బస్సుతో జంప్

By Siva KodatiFirst Published Dec 25, 2019, 2:47 PM IST
Highlights

పోలీసులు టెక్నాలజీతో నేరస్తులను పట్టుకుంటుంటే.. దొంగలు సరికొత్త ఎత్తుగడలతో తమ పని తాము చేసుకునిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి డ్రైవర్‌గా నమ్మించి కొత్త వోల్వో బస్సును కొట్టేశాడు

పోలీసులు టెక్నాలజీతో నేరస్తులను పట్టుకుంటుంటే.. దొంగలు సరికొత్త ఎత్తుగడలతో తమ పని తాము చేసుకునిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి డ్రైవర్‌గా నమ్మించి కొత్త వోల్వో బస్సును కొట్టేశాడు.

వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట పట్టణంలోని కేటీ అన్నారంకు చెందిన నిమ్మల యాదగిరి పదో తరగతి వరకు చదివి, డ్రైవర్‌గా మారాడు. డబ్బు సరిపోకపోవడంతో చోరీల బాటపట్టాడు.

Also Read:దిశ నిందితులకు మరో 9 కేసులతో లింకులు: ఆధారాలు సేకరించిన పోలీసులు

ఈ క్రమంలో 2013లో సిమెంట్ బస్తాల లోడుతో ఎల్బీ నగర్ చౌరస్తాలో నిలిపిన లారీని చోరీ చేసిన కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. అనంతర కాలంలో బాలాపూర్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ వెంకటేశ్వరరావు కొనుగోలు చేసిన భారత్ బెంజ్ వోల్వో బస్సుకు డ్రైవర్‌గా చేరాడు.

ఈ నేపథ్యంలో యజమానికి విశాఖలో పనివుండటంతో అటుగా వెళ్తూ ఈ కొత్త బస్సును ఎల్బీనగర్ చింతలకుంట వద్ద పార్క్ చేసి తన కుమారునికి తాళాలు ఇవ్వాల్సిందిగా యాదగిరిని ఆదేశించాడు. వెంటేశ్వరరావు చెప్పినట్లుగానే ఆదివారం రాత్రి కొత్తబస్సుతో సహా డ్రైవర్ యాదగిరి ఎల్బీనగర్ చౌరస్తా చేరుకున్నాడు.

బస్సు చోరీ చేయాలని పథకం వేసి, ప్లాన్‌లో భాగంగా బస్సును అక్కడే పార్క్ చేసినట్లు యజామానికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత బస్సును తీసుకుని శ్రీశైలం రోడ్డు మీదుగా వెళ్లాడు. ఈ నేపథ్యంలో యాదగిరి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో వైజాగ్‌లో ఉన్న వెంకటేశ్వరరావు అతని కుమారుడు బస్సు జాడను తెలుసుకోలేకపోయారు.

Also Read:బాలుడిపై ఏడు నెలలుగా లైంగిక దాడి: బాలికపై గ్యాంగ్ రేప్

దీంతో వెంకటేశ్వరరావు సోమవారం రాత్రి హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం  నాగర్‌కర్నూలు జిల్లా ఆమన్‌గల్‌లో రోడ్డుపై బస్సుతో పాటు ఉన్న యాదగిరిని గుర్తించి అరెస్ట్ చేశారు. 

click me!