మున్సిపల్ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించేదదే: మంత్రి ప్రశాంత్ రెడ్డి

By Arun Kumar PFirst Published Dec 24, 2019, 5:59 PM IST
Highlights

మరికొద్దిరోజుల్లో జరగనున్న మున్నిపాలిటీ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ సత్తాచాటడం ఖాయమని మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తమను ఏయే అంశాలు గెలిపించనున్నాయో మంత్రి వివరించారు. 

హైదరాబాద్: ఇప్పటివరకు నూతన రాష్ట్రం తెలంగాణలో ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారంటే అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పై వారికున్న నమ్మకమే కారణమని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మరికొద్దిరోజుల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టణ ప్రజలు ముఖ్యమంత్రిపైన పూర్తి నమ్మకం ఉంచుతారని తమకు పూర్తి విశ్వాసం వుందని ధీమా వ్యక్తం  చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా ప్రశాంత్ రెడ్డి స్పందించారు. మున్సిపల్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయని... కానీ టీఆర్ఎస్ పార్టీదే తుది విజయమని మంత్రి పేర్కొన్నారు. 

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గతంలో ఎన్నడూ చూడని నిధులు రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే కాకుండా అంతకు మునుపు కంటే ఎక్కువగా నిధులను మున్సిపాటీలకు అంధించారని పేర్కొన్నారు. 

read more మేం పవర్‌లోకి వస్తే.. నీకు తిప్పలే: ఎన్నికల కమీషనర్‌ నాగిరెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీంగల్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయని వెల్లడించారు. వీటన్నిటిలోనూ గెలుపు తమదేనని సంబంధిన నియోజకవర్గ ఎమ్మెల్యేలు ధీమాతో చెబుతున్నట్లుగా మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు వందల కోట్ల రూపాయలతో జరిగిన అభివృద్ది ప్రజల కల్ల ముందే కనిపిస్తుందన్నారు. గతంలో మున్సిపాలిటిల్లో అబివృద్ది అనేది మాటల్లో మట్టుకే జరిగేదన్నారు. 

read more  టీపీసీసీ చీఫ్ పదవి కోసం ఏకం అవుతున్న రెడ్డి సామాజిక వర్గం నేతలు

కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి అయ్యాక మున్నిపాలిటీల్లో అబివృద్దిని చేసి చూపించారన్నారు. మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్దే టీఆర్ఎస్ గెలుపుకు కారణమవుతుందని...అభివృద్ధిని చూసే ఓటు వేయాలని ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 
 

click me!