రైతు సమన్వయ సమితి వుండదు...ఇకపై అదే...: గవర్నర్ తమిళిసై

By Arun Kumar PFirst Published Mar 6, 2020, 2:26 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం ఎంతో  ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన రైతు సమన్వయ సమితుల పేరు మార్చనున్నట్లు గవర్నర్ తమిళసై అసెంబ్లీలోనే ప్రకటించారు. 

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసి విభాగం రైతు సమన్వయ సమితి. వివిధ అంచెల్లో రైతుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం కోసం సమన్వయ సమితులను ఏర్పాటుచేశారు. అయితే తాజాగా ఈ రైతు సమన్వయ సమితి అనే పేరును మార్చనున్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తరపున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన గవర్నర్ తమిళిసై ఈ పేరు మార్పుకు సంబంధించిన ప్రకటన చేశారు. 

ఇకపై రైతు సమన్వయ సమితుల పేరును రైతు బంధు సమితులుగా మారుస్తున్నట్లు గవర్నర్ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. తమ సమస్యలపై రైతులంతా కలిసి సంఘటితంగా పోరాడేందుకు ఈ సమితులు  ఉపయోగపడనున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. 

read more  తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: ముగిసిన గవర్నర్ ప్రసంగం...ఆదివారానికి సభ వాయిదా

తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వం తరపున అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతు బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ పేర్కొన్నారు. దీన్ని ఇప్పటికే అనేక రాష్ట్రాల అమలు చేస్తున్నాయని తెలిపారు. రైతు భీమా పథకం కూడా వ్యవసాయ రంగంపై ఆదారపడే రైతన్నలకు భరోసా ఇచ్చిందన్నారు గవర్నర్. 

తెలంగాణలో ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్నపరిస్థితులు వుంటే దాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వ చర్యలతో ఇప్పుడు యావత్ తెలంగాణ సుభిక్షంగా మారుతోందంటూ గవర్నర్ ప్రశంసించారు.  


 

click me!