లాల్ దర్వాజా అమ్మవారికి పీవీ సింధు ప్రత్యేక పూజలు

By telugu teamFirst Published Oct 7, 2019, 7:28 AM IST
Highlights

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు హైదరాబాదులోని లాల్ దర్వాజా అమ్మవారికి పూజలు చేశారు. ఎవరికీ తెలియకుండా ఆమె అక్కడికి చేరుకుని పూజలు చేశారు. ఇటీవల బతుకమ్మ సంబరాల్లో కూడా సింధు పాల్గొన్నారు.

హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె ఉదయం వారి తండ్రి తో కలిసి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. 

ఎవ్వరికీ తెలియ కుండా ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ తిరుపతి నర్సింగరావు ఆమెకు అమ్మవారి చీరను ప్రసాదంగా అందజేశారు. ఇటీవల ఆమె బతుకమ్మ సంబరాల్లో కూడా పాల్గొంది.

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో తెలుగు తేజం తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నోజోమీ ఒకుహురాను ఓడించి సింధు విజేతగా నిలిచింది. కేవలం 35 నిమిషాల్లో వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టి కరిపించి విజేతగా నిలిచింది.

ప్రపంచ విజేతగా నిలిచిన తర్వాత సింధు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. కేంద్ర ప్రభుత్వం సింధుకు రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఆమెకు నజరానాలు ప్రదానం చేశాయి.

click me!