బైక్‌ను ఢీకొట్టిన కారు.. దంపతుల మృతి: కారులో మైనర్లు

Siva Kodati |  
Published : Oct 06, 2019, 05:49 PM IST
బైక్‌ను ఢీకొట్టిన కారు.. దంపతుల మృతి: కారులో మైనర్లు

సారాంశం

ఆదివారం హిమాయత్ సాగర్‌ సర్వీస్ రెడ్డుపై ఇద్దరు దంపతులు వారి చిన్నారితో కలిసి బైక్‌పై వెళుతున్నారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ అక్కడికక్కడే  మరణించగా..చిన్నారి తీవ్రంగా గాయపడింది

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మరణించారు. ఆదివారం హిమాయత్ సాగర్‌ సర్వీస్ రెడ్డుపై ఇద్దరు దంపతులు వారి చిన్నారితో కలిసి బైక్‌పై వెళుతున్నారు.

ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ అక్కడికక్కడే  మరణించగా..చిన్నారి తీవ్రంగా గాయపడింది.

బైక్‌ను ఢీకొట్టిన వెంటనే పక్కనే  వున్న కాలువలోకి కారు దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు కారులో ప్రయాణిస్తున్న యువకులతో పాటు చిన్నారిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

కాగా కారును నడిపింది మైనర్ బాలుడని.. ఇతనితో పాటు మరో ఇద్దరు మైనర్లు కారులో ఉన్నారని పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతుడిని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నాగరాజుగా గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Biryani Places : న్యూ ఇయర్ పార్టీకోసం అసలైన హైదరబాదీ బిర్యానీ కావాలా..? టాప్ 5 హోటల్స్ ఇవే
IMD Cold Wave : హమ్మయ్యా..! ఇక చలిగండం గట్టెక్కినట్లేనా..?