ఘనంగా మంత్రి తలసాని జన్మదిన వేడుకలు

Siva Kodati |  
Published : Oct 06, 2019, 05:07 PM IST
ఘనంగా మంత్రి తలసాని జన్మదిన వేడుకలు

సారాంశం

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు అమీర్‌పేట మున్సిపల్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సమక్షంలో మంత్రి కేక్ కట్ చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలివచ్చారు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు అమీర్‌పేట మున్సిపల్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సమక్షంలో మంత్రి కేక్ కట్ చేశారు.

భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలివచ్చారు. తలసాని జన్మదిన వేడుకల సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పండ్ల పంపిణీ, అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో మంత్రి వీల్ చైర్ అందజేశారు. మనం సైతం కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో ముగ్గురు పేద పిల్లలకు వైద్యం కోసం ఒకొక్కరికి 25 వేలు చొప్పున 75 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీలు నేతకాని వెంకటేశ్, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, శేరి సుభాష్ రెడ్డి, ఎంఎల్‌సీ ఎగ్గే మల్లేశం, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ లక్ష్మారెడ్డి తదితరులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 


 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?