ఇస్రో సైంటిస్ట్ సురేశ్ హత్య కేసులో కొత్త కోణం

By Siva KodatiFirst Published Oct 2, 2019, 4:56 PM IST
Highlights

ఇస్రో శాస్త్రవేత్త సురేశ్ కుమార్ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సురేశ్‌కు మరో వ్యక్తితో లైంగిక సంబంధం ఉందని.. దాని కారణంగానే హత్య జరిగి ఉండొచ్చన్న విలేకరి ప్రశ్నకు తాము ఆ కోణంలో సైతం దర్యాప్తు చేస్తున్నామని పంజాగుట్ట ఏసీపీ తెలిపారు

ఇస్రో శాస్త్రవేత్త సురేశ్ కుమార్ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సురేశ్‌కు మరో వ్యక్తితో లైంగిక సంబంధం ఉందని.. దాని కారణంగానే హత్య జరిగి ఉండొచ్చన్న విలేకరి ప్రశ్నకు తాము ఆ కోణంలో సైతం దర్యాప్తు చేస్తున్నామని పంజాగుట్ట ఏసీపీ తెలిపారు.

సోమవారం విధులు ముగించుకుని సాయంత్రం 5 గంటలకు సురేశ్ తన ఫ్లాట్‌కు వెళ్లాడని.. అయితే 7 గంటలకు మరో వ్యక్తి లోపలికి వెళ్లినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఆ వ్యక్తిని శ్రీనివాస్‌గా గుర్తించారు.

మంగళవారం ఉదయం పనిమనిషి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసిందని దీంతో ఆమె తిరిగి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. అయితే చెన్నైలో పనిచేస్తున్న సురేశ్ భార్య‌ ఆయనకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకపోవడంతో సహోద్యోగులకు ఫోన్ చేశారు.

వారు కూడా ఇదే సమాధానం ఇవ్వడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారని పంజాగుట్టు ఏసీపీ తెలిపారు. సురేశ్ భార్య, పోలీసుల సమక్షంలో తాళం పగులగొట్టి చూడగా ఆయన రక్తపు మడుగులో పడివున్నారని వెల్లడించారు.

హత్యకు గల కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఏసీపీ స్పష్టం చేశారు. కుటుంబసభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. సెలవుల్లో సురేశ్ చెన్నైలోని భార్య వద్దకు వెళ్లేవారని తెలిపారు. సురేశ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నట్లుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని.. ఆ ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా ఏసీపీ వెల్లడించారు. 

మరోవైపు సురేశ్ మృతదేహానికి బుధవారం గాంధీ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆయన తలపై గాయాలు ఉన్నాయని.. మరిన్ని ఆధారాల కోసం ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు:

ఎస్ఆర్. నగర్‌లో ఇస్రో సైంటిస్ట్ దారుణహత్య

click me!