బెంగళూరులో మిస్సింగ్... హైదరాబాద్ లో ఇంజనీరింగ్ స్టూడెంట్ మృతదేహం

Arun Kumar P   | Asianet News
Published : Dec 24, 2019, 03:41 PM ISTUpdated : Dec 24, 2019, 09:43 PM IST
బెంగళూరులో మిస్సింగ్... హైదరాబాద్ లో ఇంజనీరింగ్ స్టూడెంట్ మృతదేహం

సారాంశం

బెంగళూరుకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి హైదరాబాద్ శివారులోని ఓ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.  

హైదరాబాద్: కర్ణాటక రాజధాని బెంగళూరులో మాయమైన ఓ ఇంజనీరింగ్ కాలేజి యువకుడు హైదరాబాద్ లో శవమై తేలాడు. ఈ ఘటన ఇరు రాష్ట్రాల రాజధానుల్లో కలకలం రేపుతోంది. 

ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన సుమిత్ శ్రీవాస్తవ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే అతడు కొద్దిరోజుల క్రితం ఇంటినుండి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే అతడు తాజాగా హైదరాబాద్ లో తాజాగా శవమై తేలాడు. నగర  శివారులోని శంషాబాద్ లో ఓయో హోటల్లో సోమవారం సాయంత్రం దిగాడు. ఉదయాన్నే హోటల్ సిబ్బంది రూంసర్వీస్ కోసం వెళ్లగా తలుపు తీయలేదు. అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

read more  భూవివాదంలో పోలీసుల జోక్యం... వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం 

ఈ సమాచారంలో హోటల్ వద్దకు చేరుకున్న శంషాబాద్ పోలీసులు హోటల్ సిబ్బందివద్ద  మరో తాళంతో రూంలోకి  ప్రవేశించారు. అప్పటికే శ్రీవాస్తవ బెడ్ పై విగతజీవిగా పడివున్నాడు. 

దీంతో వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తే ప్రారంభించారు. అతడి వద్ద దొరికిన వస్తువుల ఆధారంగా బెంగళూరు వాసిగా  గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అతడిపై మిస్సింగ్ కేసు నమోదయి వున్నట్లు బయటపడింది. 

read more  హైకోర్టుకు చేరిన దిశ నిందితుల రీపోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టు

బెంగళూరు పోలీసులు అంధించిన  వివరాల ఆధారంగా ఈ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  విద్యార్థి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు  పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?