మీర్ పేట్ లో ఫేక్ డాక్టర్ : ఎంసెట్ లో సీటు రాలేదు కానీ.. ఏడేళ్లుగా ప్రాక్టీస్...

By AN TeluguFirst Published Dec 10, 2020, 10:27 AM IST
Highlights

ఇంటర్ చదివి, ఎంబీబీఎస్‌ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్‌లోని టీఎస్ఆర్‌నగర్‌లోని సాయి క్లినిక్ ను పోలీసులు సీజ్ చేశారు. 

ఇంటర్ చదివి, ఎంబీబీఎస్‌ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్‌లోని టీఎస్ఆర్‌నగర్‌లోని సాయి క్లినిక్ ను పోలీసులు సీజ్ చేశారు. 

కొంపల్లి సాయికుమార్‌ 2004లో ఇంటర్‌ బైపీసీ పూర్తి చేశాడు. డాక్టర్‌ కావాలని నిర్ణయించుకున్నాడు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు కోసం నారాయణగూడలో కోచింగ్‌ తీసుకున్నాడు.కానీ రాలేదు. దీంతో సంతోష్ నగర్‌లోని శ్రీనివాస ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌గా 2006-2012 వరకు పనిచేశారు.

మెడికల్‌ ఫీల్డ్‌లో అనుభవం.. రోగాలు, మందులు తదితర విషయాలపై అవగాహన పెంచుకున్నాడు. తనకు వస్తున్న సంపాదన సరిపోకపోవడంతో సొంతంగా క్లినిక్‌ నడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు 2013లో మీర్‌పేట ఎక్స్‌రోడ్‌లో సాయిక్లినిక్‌ను ఏర్పాటు చేశాడు. 

ఎంబీబీఎస్‌ డాక్టర్‌గా చెలామణి అవుతూ.. ప్రజలకు వైద్యం చేస్తున్నాడు. ఓపీ ఫీజు రూ. 150 తీసుకుంటున్నాడు. అంతేకాకుండా నగరంలోని పలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఎంబీబీఎస్‌ డాక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. 

నకిలీ డాక్టర్‌ గురించి విశ్వసనీయ సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు క్లినిక్‌పై దాడి చేసి అతడిని అదుపులోకి  తీసుకున్నారు. అతని సర్టిఫికెట్స్‌ పరిశీలించగా ఎంబీబీఎస్‌ చేసినట్లుగా ఆధారాలు లభించలేదు. అంతేకాకుండా సాయికుమార్‌ అనుమతులు లేకుండానే చట్టవ్యతిరేకంగా క్లినిక్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

సాయికుమార్‌ చేసిన చికిత్స వల్లనే తాము కోలుకున్నామని పలువురు స్థానికులు పేర్కొనడం గమనార్హం. ఆయన ఎంబీబీఎస్‌ చదివారా లేదా అన్నది తమకు తెలియదని, కరోనా సోకినప్పుడు చికిత్స తీసుకున్నామని వారు తెలిపారు. 
 

click me!