బీజేపీ కార్పొరేటర్‌కు స్వీట్లు తినిపించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

Bukka Sumabala   | Asianet News
Published : Dec 07, 2020, 12:40 PM ISTUpdated : Dec 07, 2020, 12:41 PM IST
బీజేపీ కార్పొరేటర్‌కు స్వీట్లు తినిపించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

సారాంశం

పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలన్న దానికి నిదర్శనంగా నిలిచింది ఓ సీన్. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్ ఎ. పావనీ విజయకుమార్ కు స్వీట్లు తినిపించారు. ఈ సంఘటన అందరికీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎ. పావనీ విజయకుమార్ గాంధీనగర్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 

పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలన్న దానికి నిదర్శనంగా నిలిచింది ఓ సీన్. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్ ఎ. పావనీ విజయకుమార్ కు స్వీట్లు తినిపించారు. ఈ సంఘటన అందరికీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎ. పావనీ విజయకుమార్
గాంధీనగర్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 

ఈ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉండగా, అన్ని చోట్లా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓడిపోయారు. ఐదు డివిజన్లలో బీజేపీ విజయపతాక ఎగురవేసింది. ముఖ్యంగా గాంధీనగర్‌ డివిజన్‌లో ఎమ్మెల్యే మరదలు ముఠా పద్మ పోటీ చేశారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి ఎ.పావనీవిజయ్‌కుమార్‌ విజయం సాధించారు. 

కాగా, ఆదివారం డివిజన్‌లోని జవహర్‌నగర్‌లో పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సమ్మేళనానికి గాంధీనగర్‌ కార్పొరేటర్‌ ఎ. పావనివినయ్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ఆమెను ప్రత్యేకంగా అభినందించి స్వీట్‌ తినిపించడంతో అక్కడ ఉన్న వారంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. 

తన మరదలిని ఓడించిన కార్పొరేటర్‌ను ఎమ్మెల్యే ప్రశంసించడంతో.. ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా పని చేయాలన్న దానికి ఇది ఉదాహరణగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?