ఆన్ లైన్ లోనే అన్నీ...హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

Arun Kumar P   | Asianet News
Published : Dec 06, 2020, 11:52 AM IST
ఆన్ లైన్ లోనే అన్నీ...హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

సారాంశం

ఆన్ లైన్ లోనే వ్యబిచార దందా నిర్వహిస్తున్నఓ ఘరానా ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: ఆన్ లైన్ ద్వారా విటులకు అమ్మాయిలను ఎరగావేసి గుట్టుగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో  మానవ అక్రమ రవాణా నిరోధక బృందం అదికారులు రంగంలోకి సరూర్ నగర్ పోలీసుల సాయంతో ఈ వ్యబిచార ముఠా గుట్టురట్టు చేశారు.

 వరుణ్ అనే వ్యక్తి ఇతర నగరాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను రప్పించి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నాడు. అమ్మాల ఫోటోలను సోషల్ మీడియా మాద్యమాల్లో పెట్టి విటులను ఆకర్షించడమే కాదు ఆన్ లైన్ లోనే విటుల నుండి డబ్బులు తీసుకుంటాడు. ఆ తర్వాత వారు కోరుకున్న అమ్మాయిని కోరుకున్న ప్రాంతానికి పంపిస్తాడు. ఇలా గలీజ్ దందా చేస్తూ సులువుగా డబ్బు సంపాదిస్తున్నాడు.

ఈ దందా కోసం పలువురిని తన ముఠాలో నియమించుకున్నాడు. అయితే ఈ ముఠా కార్యకలాపాలపై రాచకొండ పోలీసులకు సమాచారం అందింది. దీంతో దిల్‌సుఖ్ నగర్ ప్రాంతంలో విటుల కోసం ఎదురుచూస్తున్న ముఠా సభ్యులు, ఓ యువతిని అరెస్ట్ చేశారు. నిర్వాహకులు మహేందర్(32) సుజాత (50)లను అరెస్టు చేసి బాధిత యువతిని రక్షించి రెస్క్యూ హోంకు తరలించారు.  మిగతా ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...