కేసీఆర్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ... మంత్రులు ఏమన్నారంటే

By Arun Kumar PFirst Published Jan 9, 2020, 7:34 PM IST
Highlights

తెెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో గురువారం తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు.  

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభంకావడంతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు టీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. ఇదివరకే ఒక్క మున్సిపల్ స్థానాన్ని కోల్పోయినా కూడ మంత్రి పదవి పోతోందని సీఎం కేసీఆర్ ఇప్పటికే మంత్రులను హెచ్చరించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

 పార్లమెంట్ ఎన్నికల్లో అంచనాలు తప్పినతర్వాత  జరుగుతున్న ఈ ఎన్నికలను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు దిశానిర్ధేశం చేయడమే కాదు స్ట్రాంగ్ గా హెచ్చరించినట్లు తెలుస్తోంది. 

ముఖ్యమంత్రితో భేటీ అనంతరం కొందరు మంత్రులు స్పందించారు. ముందుగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... సీఎం తమను భాద్యతగా నడుచుకోవాలి సూచించినట్లు తెలిపారు. అందరూ కలిసి పనిచేసుకోవాలని చెప్పారని...ఇప్పటివరకు సర్వే ఫలితాలు టీఆరెస్ కి అనుకూలంగా ఉన్నట్లుగా చెప్పారన్నారు. రెబల్స్ బెడద లేకుండా సమన్వయం చేసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. అందరిని కలుపుకొని పోయి ఎన్నికల్లో విజయం సాధించాలని సూచించినట్లు తెలిపారు.

read more  న్యూజిలాండ్ ఎంపీతో మంత్రి సింగిరెడ్డి భేటి... చర్చించిన అంశాలివే

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ... కేంద్రం నిధులు ఇవ్వకుండా కరీంనగర్ అభివృద్ధిని అడ్డుకుందన్నారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో ఈ అరేళ్లలో అభివృద్ధి మాత్రమే కరీంనగర్ చూసిందన్నారు. పార్టీలో ఎలాంటి అంతర్గత కలహాలు లేవని... అందరిని కలుపుకొని ఎన్నికల్లో గెలుస్తున్నామన్నారు. కరీంనగర్ లో టీఆరెస్ భారీ విజయం నమోదు చేయనుంది.

 కాంగ్రెస్ నేతల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని... మాజీ పిసిసి చీఫ్ పొన్నాల నాలుగు సార్లు ఓడిపోయారని అన్నారు. పొన్నాలకు మతిస్థిమితం లేదని...తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినంత మాత్రణ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్-కేటీఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్ అభివృద్ధి చాల జరిగిందన్నారు.

మరో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... ఎన్నికల్లో టీఆరెస్ భారీ విజయం సాధించబోతుందన్నారు. ప్రజా పథకాలే తమ ఎజెండా అని... సమన్వయం తో అందరిని కలుపుకొని వెళ్తున్నామన్నారు. రెబల్స్ ను బుజ్జగించే సత్తా తమ దగ్గర ఉందని... కేసీఆర్ సూచనల మేరకు మున్సిపోల్స్ లో ఘన విజయం సాధిస్తామన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా వుంటామన్నారు. పల్లె ప్రగతి లాగా పట్టణ ప్రగతి చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీలో పోటీ తత్వాన్ని నివారిస్తామని... అవకాశం రాని వారికి భవిష్యత్ ఉంటుందన్నారు. వచ్చే 15 సంవత్సరాలు టీఆరెస్ అధికారంలో ఉంటుందని... ఇప్పుడు అవకాశం రాకపోతే భవిష్యత్ లో మంచి అవకాశాలు ఉంటాయన్నారు.

read more  మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.... ప్రజా పథకాలే ప్రధాన ఎజెండాగా ముందుకెళతామని...టీఆరెస్ కి మున్సిపల్ లో తిరుగు లేదన్నారు. పార్టీలో పోటీ తత్వం బాగా ఉంది అయితే రెబల్స్ బెడద ఇప్పుడు కొత్త కాదన్నారు. ఎమ్మెల్యే-ఎంపీ ఎన్నికలప్పుడు కూడాఇది ఉందని.. రెబల్స్ పంచాయితీ లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయన్నారు. రెబల్స్ ను ఎలా సమన్వయం చెయ్యాలో తమకు తెలుసన్నారు.

మరో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతు...మేడ్చెల్ లో తమ గెలుపుకు ప్రభుత్వ పథకాలు, సీఎం సూచనలే ప్రచార అస్త్రాలన్నారు. తమ దగ్గర ఎలాంటి రెబల్స్ లేరని... తామందరం అన్నదమ్ములెక్క కలిసి పనిచేసుకుంటున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే కు నాకు ఎలాంటి గొడవ జరగలేదన్నారు.తనపై అసత్య ప్రచారం జరుగుతుందని...నిన్న బోడుప్పల్ లో గొడవకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గొడవ చేసిన మహిళ టీఆరెస్ నాయకురాలే కాదన్నారు.

click me!