న్యూజిలాండ్ ఎంపీతో మంత్రి సింగిరెడ్డి భేటి... చర్చించిన అంశాలివే

By Arun Kumar PFirst Published Jan 9, 2020, 6:59 PM IST
Highlights

భారత పర్యనటలో భాగంగా తెలంగాణకు విచ్చేసిన న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ తో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భేటీ అయ్యారు.  

హైదరాబాద్: భారత పర్యటనలో భాగంగా తెలంగాణకు విచ్చేసిన న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే అంశంపై  చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతాంగానికి ఎలా సహకరిస్తుందో నిరంజన్ రెడ్డి కివీస్ ఎంపీకి వివరించారు. 

ప్రపంచ పంటలకు తెలంగాణ అనుకూలమని...ఇక్కడుంటే వాతావరణ పరిస్థితులు ప్రపంచంలో కొన్నిచోట్ల మాత్రమే ఉన్నట్లు మంత్రి తెలిపారు.  నాణ్యతా ప్రమాణాలు పెంచితే ప్రపంచంలో తెలంగాణ ఉత్పత్తులు నంబర్ వన్ అవుతాయని అన్నారు. 

Video : తెలంగాణ వాతావరణం చాలా ప్రత్యేకం...న్యూజిలాండ్ ఎంపీ కితాబు...

ముఖ్యంగా ఇక్కడ పండే వేరుశనగ ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి సారిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సేంద్రీయ సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. న్యూజిలాండ్ తో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలకు తెలంగాణ నుండి వివిధ పంటలు ఎగుమతి అవుతున్నట్లు వివరించారు. ఆయా దేశాల ప్రమాణాలకు అనుగుణంగా రైతులు పంటలు పండించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

read more  మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...

పంటల సాగులో ఎరువులు, రసాయనాలను తగ్గించేందుకు రైతులకు వ్యవసాయ శాఖ నుండి తగు సహకారం అందిస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైతుల పంటల సాగుకు ప్రభుత్వం నుండి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఎలాంటి పరిస్థితులను అయినా అధిగమించి పంటలు పండించే అవకాశం ఉందన్నారు. 

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుండి వసతులు, రాయితీలు అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ పై ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందన్నారు. 

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో మంత్రి పాల్గొన్నారు. న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్ తో కలిసి మంత్రుల నివాస సముదాయంలోని తన క్వార్టర్ లో మూడు మొక్కలు నాటారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్నారై టీఆర్ఎస్ నేత మహేష్ బిగాల, రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు రాఘవ, కిశోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

click me!