బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం: మద్యం తాగి ర్యాష్ డ్రైవింగ్, టెక్కీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

By telugu teamFirst Published Jan 22, 2020, 11:12 AM IST
Highlights

బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పై మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు యువకుల మృతికి కారణమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అభిలాష్ డ్రైవింగ్ లైసెన్సును ఆర్టీఎ అధికారులు రద్దు చేశారు.

హైదరాబాద్: హైదరాబాదులోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై రాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరి మృతికి కారణమైన సాఫ్ట్ వేర్ ఇంజనీరు అభిలాష్ డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేశారు. మద్యం మంత్తులో ఉన్న టెక్కీ అభిలాష్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై ఇద్దరు యువకులను ఢీకొట్టాడు. దాంతో వారు మరణించారు. 

ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు యువకులు బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై సెల్ఫీ దిగుతున్నారు. దాంతో రాయదుర్గం పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆల్కహాల్ 230ఎంజీ/100 ఎంఎల్ ఉండడంతో కూకట్ పల్లి ఆర్టీఎ అధికారులు 2019 నవంబర్ 15వ తేదీ నుంచి 2020 నవంబర్ 15వ తేదీ వరకు ఏడాది పాటు అభిలాష్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. 

Also Read: హైదరాబాద్: ఫ్లైఓవర్ నుంచి కింద పడ్డ కారు, విధ్వంసం, మహిళ మృతి

గత నవంబర్ 10వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట సమయంలో కూకట్ పల్లి శాంతి నగర్ నివాసి అభిలాష్ పెదకొట్ల మెహిదీపట్నంలో మద్యం తాగి మిత్రుడితో కలిసి ఐ20 కారులో కూకట్ పల్లికి బయలుదేరాడు.అభిలాష్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై సెల్ఫీ దిగుతున్న ఇద్దరు యువకులను ఢీకొట్టాడు.

దాంతో సరూర్ నగర్ కు చెందిన పి. సాయి వంశీకృష్ణ (22), కిష్టాపూర్ నకు చందిన ఎన్. ప్రవీణ్ (22)లు ఫ్లై ఓవర్ పై నుంచి ఎగిరి కిందపడి మరణించారు. కారు మరో రెండు టూవీలర్స్ ను ఢీకొట్టింది. దాంతో నలుగురు గాయపడ్డారు. బయో డైవర్సిటీ ప్రారంభమైన ఏడు రోజులకే ఈ ప్రమాదం సంభవించింది.

Also Read: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం దృశ్యాలు

click me!