నడిరోడ్డుపై...పట్టపగలే...సాప్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటోడ్రైవర్

Arun Kumar P   | Asianet News
Published : Jan 11, 2020, 10:09 PM ISTUpdated : Jan 11, 2020, 10:21 PM IST
నడిరోడ్డుపై...పట్టపగలే...సాప్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటోడ్రైవర్

సారాంశం

తెలంగాణ రాజధాని నడిబొడ్డున అదీ పట్టపగలే ఓ కామాంధుడయిన ఆటోడ్రైవర్ రెచ్చిపోయాడు. కన్నూ మిన్ను కానకుండా ఓ సాప్ట్ వేర్ ఉద్యోగిణితో అసభ్యంగా ప్రవర్తించి చివరకు కటకటాలపాలయ్యాడు.

హైదరాబాద్: మహిళల సంరక్షణకు తెలంగాణ పోలీస్ శాఖ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. మహిళలపై వేధింపులకు పాల్పడేవారి భరతం పట్టేందుకే ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటుచేసింది. ఇక దిశ ఘటన తర్వాత మహిళా సంరక్షణపై మరింత శ్రద్ద పెట్టింది. ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లతో పాటు ప్రత్యేకంగా యాప్ లు రూపొందించింది. అంతేకాకుండా వేధింపుల కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా కేసులు పెడతోంది. ఇంత చేస్తున్న మహిళలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే ఓ ఆకతాయి ఆటోడ్రైవర్ యువతిపై వేధింపులకు పాల్పడుతూ పట్టుబడ్డాడు. 

హైదరాబాద్‌లోని బంజారా‌హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిణిపై నరసింహ అనే ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి ఒంటరిగా వుందన్న ధైర్యంతో పట్టపగలే నడిరోడ్డుపైనే కన్నూ మిన్న కానకుండా వ్యవహరించాడు. యువతి చేయిపట్టుకుని లాగుతూ వెకిలిచేష్టలకు దిగాడు. తనను  ఎవరేం చేయలేరన్న ధైర్యంతో రెచ్చిపోయాడు. 

read more  ఆమె నా కొడుకుని ట్రాప్ చేసింది.. మోడల్ పై అత్యాచార ఘటనలో నిందితుడి తల్లి

అయితే దీన్ని గమనించిన స్థానికులు ఈ కంత్రీ ఆటోడ్రైవర్ పనిపట్టారు. అతన్ని పట్టుకుని దేహశుద్ది చేయడమే కాదు ఓ స్తంబానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలాంటి ఘటనలు  మహిళల భద్రతతపై అనుమానాలను రేకెత్తిస్తుంటాయి. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?