తాగిన మత్తులో కూతురిని గొంతు నులిమి చంపిన తండ్రి

Published : Jan 11, 2020, 12:21 PM IST
తాగిన మత్తులో కూతురిని గొంతు నులిమి చంపిన తండ్రి

సారాంశం

మద్యం మత్తులో దుర్గారావు అనే వ్యక్తి హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో తన ఐదేళ్ల కూతురిని గొంతు నులిమి హత్య చేశాడు. భార్య ఇంట్లో లేని సమయంలో అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు.

హైదరాబాద్: హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో అత్యంత అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. తాగిన మత్తులో ఓ తండ్రి తన కన్నకూతురిని హత్య చేశాడు. దుర్గారావు అనే వ్యక్తి తాగి వచ్చి తన ఐదేళ్ల కూతురు యామినిని గొంతు నులిమి చంపేశాడు. 

భార్య ఇంట్లో లేని సమయంలో దుర్గారావు ఈ దారుణానికి ఒడిగట్టాడు. దుర్గారావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. ఎల్బీ నగర్ లోని బాలాజీ నగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది.

వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?