పుట్టినరోజు వేడుక... మైనర్ బాలికపై రాత్రంతా స్నేహితుడి అఘాయిత్యం

Arun Kumar P   | Asianet News
Published : Jan 11, 2020, 05:14 PM ISTUpdated : Jan 11, 2020, 05:19 PM IST
పుట్టినరోజు వేడుక... మైనర్ బాలికపై రాత్రంతా స్నేహితుడి అఘాయిత్యం

సారాంశం

పదో తరగతి చదువుతున్న ఓ బాలికతో స్నేహం పేరుతో దగ్గరయిన ఓ యువకుడు చివరకు అత్యాచాారానికి పాల్పడ్డాడు.ఈ అఘాయిత్యం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఓ కామాంధుడు దారుణానికి పాల్పడ్డాడు. తనను నమ్మి వెంటవచ్చిన స్నేహితురాలిపై ఓ విద్యార్ధి అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ బాలికపై  అఘాయిత్యానికి పాల్పడిన అతడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి తోశారు. 

ఈ అఘాయిత్యానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నారాయణగూడలోని ఓ పాఠశాలలో బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమెకు తన స్నేహితురాలి ద్వారా యాద్రాద్రి జిల్లాకు చెందిన రోహన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం మంచి స్నేహంగా మారింది. 

read more  ఆమె నా కొడుకుని ట్రాప్ చేసింది.. మోడల్ పై అత్యాచార ఘటనలో నిందితుడి తల్లి

నగరంలోనే ఐటిఐ చదువుతున్న రోహన్ తరచూ బాలికను కలుస్తూ వుండేవాడు. ఈ క్రమంలో అతడిపై ఆమెకు నమ్మకం ఏర్పడింది. దీంతో గత నెల చివర్లో తన పుట్టినరోజు వుందని... వేడుకల  చేసుకుందామని  బాలికను నమ్మించిన రోహన్ వనస్థలిపురం కు తీసుకెళ్లాడు. అక్కడ ఓ రూంలోకి బాలికను తీసుకెళ్ళి ఆ రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అయితే స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసమని బయటకు వెళ్లిన కూతురు  అర్థరాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఖంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులకు  ఫిర్యాదు చేశారు. తర్వాత రోజు ఉదయాన్నే ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపింది. దీంతో వారు పోలీసులకు తెలియజేశారు. 

బాధిత బాలిక తెలిపిన వివరాలతో నిందితుడు రోహన్ ది యాదాద్రి జిల్లాలోని  ఇజాంపురం గ్రామంగా పోలీసులు గుర్తించారు. స్వగ్రామంలో వున్న అతడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్ చేసినట్లు నారాయణగూడ పోలీసులు  తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?