ఉద్యోగ కాంట్రాక్ట్ ముగింపు: మనస్తాపంతో మహిళా టెక్కీ ఆత్మహత్య

Published : Nov 20, 2019, 12:29 PM ISTUpdated : Nov 20, 2019, 12:44 PM IST
ఉద్యోగ కాంట్రాక్ట్ ముగింపు: మనస్తాపంతో మహిళా టెక్కీ ఆత్మహత్య

సారాంశం

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. రాయదుర్గంలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె పేరు హరిణీగా తెలుస్తోంది. 

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. రాయదుర్గంలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె పేరు హరిణీగా తెలుస్తోంది. 24 ఏళ్ల ఆమె గత రెండున్నరేళ్లుగా మాదాపూర్‌లోని క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.

ఒప్పందం ప్రకారం సదరు కంపెనీతో ఉద్యోగ కాంట్రాక్ట్ ముగస్తుండటంతో ఉద్యోగం పోతుందన్న మనస్తాపంతో హరిణీ ఆత్మహత్య చేసుకుంది. బుధవారం గచ్చిబౌలీలో తను నివసిస్తున్న హాస్టల్ గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది.

ఉదయం హరిణీని గమనించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు హరిణీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Biryani Places : న్యూ ఇయర్ పార్టీకోసం అసలైన హైదరబాదీ బిర్యానీ కావాలా..? టాప్ 5 హోటల్స్ ఇవే
IMD Cold Wave : హమ్మయ్యా..! ఇక చలిగండం గట్టెక్కినట్లేనా..?