
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఇవాళ ఉదయమే మేడారానికి చేరుకున్న వెంకయ్య కాపేనటి క్రితం సమక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నిలువెత్తు బంగారాన్ని( బెల్లం) ను అమ్మవార్లకు సమర్పించారు. క్యూలైన్ వేచివున్న భక్తులతో ముచ్చటించిన వెంకయ్య వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన...తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జాతర ఏర్పాటు, సౌకర్యాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఇక్కడికి వచ్చి వనదేవతలను దర్శించుకోవడం గౌరవప్రదంగా భావిస్తున్నట్లు తెలిపారు. చారిత్రక కాలం నుంచి వస్తున్న ఇలాంటి వేడుకలను కాపాడుకోవాల్సిన అవసరముందని ప్రజలకు, ప్రభుత్వాలకు సూచించారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఒడిషా ల నుండి భారీ సంఖ్యలో గిరిజనులు పాల్గొని విజయవంతం చేస్తున్నారని, వారందరికి వన దేవతల ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఓ జాతరలో పాల్గొనడం తాను ఎక్కడా చూడలేదని అన్నారు. దీన్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని అన్నారు. 1986 లోనే మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తింపు వచ్చిందని, ఇక కేంద్ర ప్రభుత్వ గుర్తింపు రావాల్సిన అవసరం ఉందని గుర్తించారు.
ఇపుడు తాను ఉపరాష్ట్రపతి హోదాలో వచ్చినప్పటికి గతంలో చాలాసార్లు సాధారన పైరుడిగా ఈ జాతరలో పాల్గొన్నట్లు తెలిపారు. స్వతహాగా తనకు వేడుకలు, పండుగలు, ఉత్సవాలంటే ఆసక్తని, ఎందుకంటే అవి మన పూర్వీకులు అందించిన అపూర్వ కానుకలని అన్నారు. మేడారం జాతర తో తెలంగాణ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు.