తొగాడియాను ఎన్ కౌంటర్ చేస్తారా?

First Published Jan 16, 2018, 11:58 AM IST
Highlights
  • విహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తోగాడియాకే ప్రాణాపాయం పొంచివుందట.

కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీనే అందరికీ తెలుసు. కానీ భాజపాను వెనకుండి నడిపించేది ఆర్ఎస్ఎస్, విహెచ్పీ అన్నమాట ఎప్పటి నుండో వినబడుతున్నదే. కేంద్రప్రభుత్వాన్నే వెనకుండి నడిపిస్తున్నాయంటే ఆ సంస్ధలు, వాటి అధిపతులు ఇంకెత పవర్ ఫుల్ గా ఉండాలి? కానీ సీన్ మాత్రం రివర్స్ లో నడుస్తోందని అనిపిస్తోంది. ఎందుకంటే, వెనకుండి నడిపిస్తున్న రెండు సంస్దల్లో విహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తోగాడియాకే ప్రాణాపాయం పొంచివుందట. అదికూడా పోలీసులు ఎన్ కౌంటర్ చేయాలని చూస్తున్నారట.

 

ఆయన మాటలు చూస్తుంటే ప్రవీణ్ తొగాడియా ఎన్ కౌంటర్ కు రంగం సిద్ధమైందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. పదేళ్ళనాటి కేసుపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాజస్ధాన్, గుజరాత్ ప్రభుత్వాలు తనను వేధిస్తున్నాయంటూ మండిపడ్డారు. 2001లో ఓ అల్లర్ల కేసులో తొగాడియాపై అరెస్టు వారెంటు జారీ అయ్యింది. అయితే, అప్పటి నుండి తొగాడియా పోలీసుల కన్ను గప్పి తిరుగుతూనే ఉన్నారు. మొన్న కూడా అరెస్టు వారెంటు అందించేందుకు పోలీసులు పార్టీ కార్యాయంకు వెళ్ళగా అప్పటికే కార్యాలయం నుండి తప్పించుకున్నారు. అయితే, సాయంత్రం ఓ పార్కులో అపస్మారకస్ధితిలో కనిపించారు. దాంతో స్ధానికులు తొగాడియాను ఆసుపత్రిలో చేర్పించారు.

అదే విషయమై తొగాడియా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తనను ఫేక్ ఎన్ కౌంటర్లో చంపేసేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నట్లు చెప్పటం సంచలనంగా మారింది. తనపై తప్పుడు కేసు బనాయించి ఇబ్బంది పెడుతున్నట్లు మండిపడ్డారు. తన వాదనను వినిపించేందుకు కనీసం అవకాశం కూడా ఇవ్వటం లేదట. తనపై జారీ అయిన అరెస్టు వారెంటు చట్ట విరుద్దమని తొగాడియా వాదిస్తున్నారు. గుజరాత్, రాజస్ధాన్ పోలీసులు తనను వెంటాడుతున్నారు కాబట్టే తన మొబైల్ ఫోన్ ను స్విచ్చాఫ్ చేసినట్లు చెప్పారు.

పోలీసులు చెబుతున్నట్లు తాను ఎక్కడికీ పారిపోలేదని, అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఫేక్ ఎన్ కౌంటర్ నుండి తప్పించుకునేందుకే తాను ఆటోలో తిరుగుతున్నట్లు చెప్పారు. అనారోగ్యం నుండి కోలుకున్నాక తానే గుజరాత్ పోలీసులకు లొంగిపోతానంటూ ప్రకటించారు.

click me!