చంచల్ గూడలో టెన్షన్ టెన్షన్ (వీడియో)

First Published Dec 27, 2017, 12:46 PM IST
Highlights
  • చంచల్ గూడ జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత
  • ఎమ్మార్ఫిఎఫ్ కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్

హైదరాబాద్ చంచల్ గూడ జైలు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. జైళ్లో ఉన్న ఎమ్మార్పిఎఫ్ వ్యవస్థాపక అద్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఇవాళ విడుదల కానున్న నేపథ్యంలో ఎమ్మార్పిఎఫ్ కార్యకర్తలు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు, ఎమ్మార్ఫిఎఫ్ నాయకుల మద్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో పోలీసులు మంద కృష్ణ మాదిగ అభిమానులు, కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. అయితే నిరసనకారులు కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తండటంతో జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 సికింద్రాబాద్ న్యాయస్థానం నిన్నే ఆయనకు  బెయిల్ మంజూరు చేసినా, ఆర్డర్ కాఫీ జైలుకు చేరకపోవడంతో విడుదల కాలేకపోయారు. అయితే  ఈరోజు జైలు నుండి ఆయన విడుదల కానున్నారు. దీంతో జైలు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  భారీగా అభిమానులు ,  ఎమ్మార్పిఎప్ నాయకులు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకుంటుండంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీసీపీ సత్యనారాయణ పర్యవేక్షణ లో భద్రత చర్యలు చేపట్టారు.  అలాగే చంచల్ గూడ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా ముందస్తుగానే వాహనాలను వేరే మార్గాల్లోకి మల్లిస్తున్నారు. 
 

చంచల్ గూడ వద్ద  ప్రస్తుత పరిస్థితి వీడియో

 

click me!