కేసీఆర్ ఫ్యామిలీ లో విషాదం

Published : Feb 21, 2018, 03:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
కేసీఆర్ ఫ్యామిలీ లో విషాదం

సారాంశం

కేసీఆర్ కుటుంబంలో విషాదం సీఎం సోదరి విమలాబాయి మృతి

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. కేసీఆర్ కు అత్యంత ఆప్తురాలు, తోబుట్టువు పి. విమలాబాయి(82) ఇవాళ ఉదయం కన్నుమూశారు.  సోదరి వియోగంతో సీఎం శోకసంద్రంలో మునిగిపోయారు. విమలాబాయి మరణ వార్త తెలియగానే  సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్, ఎంపీ కవితతో పాటు పలువురు ప్రముఖులు ఆల్వాల్ లోని ఇంటికి చేరుకుని నివాళులర్పించారు.

సీఎం కేసీఆర్ కు మొత్తం 10 మంది తోబుట్టువులున్నారు. వీరిలో 9 మంది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. ఇపుడు చనిపోయిన విమలాబాయి కేసీఆర్ రెండో అక్క. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
విమలాబాయి అంత్యక్రియలను ఈ రోజు మధ్యాహ్నం అల్వాల్‌లో శ్మశాన వాటికలో నిర్వహిస్తారు. దీంట్లో సీఎం తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యులు పాల్గొననున్నారు. 
 
 
 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)