ఫీజు కోసం ఈ చిన్నారులను స్కూల్ యాజమాన్యం ఏం చేసిందంటే (వీడియో)

First Published Mar 8, 2018, 11:49 AM IST
Highlights
  • విద్యార్థులను బంధించిన వరంగల్ లోని ఓ కార్పోరేట్ స్కూల్
  • ఫీజు వసూళ్ల కోసం అమానుషం  

ముక్కుపచ్చలారని చిన్నారులను స్కూల్ ఫీజుల కోసం బంధించిన ఓ కార్పోరేట్ స్కూల్ యాజమాన్యం బాగోతం వరంగల్ జిల్లాలో బైటపడింది. వరంగల్ పట్టణ శివారులోని కరీమాబాద్ లో గల వరంగల్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఫీజు కట్టలేదంటూ చిన్నారులను స్కూల్ యాజమాన్యం ఓ గదిలో బంధించింది. ఇలా యూకేజి నుండి 10 వ తరగతి వరకు గల ఫీజు కట్టని విద్యార్థులను క్లాస్ రూంలకు వెళ్లనీయకుండా రోజంతా ఓ గదిలో పెట్టారు. ఇలా పిల్లలపై అమానుషంగా ప్రవర్తించిన యాజమాన్యంపై తల్లిదండ్రులు ఆగట్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు కట్టాలని తమకు సమాచారం ఇవ్వకుండానే స్కూల్ సిబ్బంది ఇలా ప్రవర్తించడం బాగాలేదని, దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.

 

వీడియో

 

click me!