చైనా పై దాడికి సిద్దం

Published : Jul 28, 2017, 02:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
చైనా పై దాడికి సిద్దం

సారాంశం

యుద్దం చేయ్యాల్సి వస్తే సిద్దమన్న అమెరికా వారంలో ఉత్తర్వులు వచ్చిన సైన్యం సిద్దం. ప్రకటించిన దళ కమాండర్ స్విప్ట్

అమెరికా, చైనా మ‌ధ్య గొడ‌వ రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చ‌తుంది. చైనా చేస్తున్న కొన్ని ప‌నులు అమెరికా దేశానికి శాంతిభ‌ద్ర‌త‌లకు భంగం క‌ల్గిగేదిగా ఉన్నాయ‌ని అమెరికా భావిస్తొంది. అందుకు ఇరు దేశాలు ప్ర‌త్య‌క్షంగానే మాట‌ల యుద్దం న‌డుస్తుంది. చైనా పై మ‌రో సారి అమెరికా యుద్దానికి సై అంటొంది. అమెరికా ప‌సిఫిక్ ధ‌ళ క‌మాండ‌ర్ స్కాట్ స్విప్ట్ చేస్తున్న వ్యాఖ్య‌లు మ‌రింత ముదిర‌న‌ట్లు తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశిస్తే... చైనా పై అణ్వస్త్రాలు ప్రయోగిస్తాం అని ఆయ‌న ఆయ‌న ఏ మాత్రం త‌డుముకోకుండా తెలిపారు. 

 అమెరికా-ఆస్ట్రేలియా సంయుక్త సైనిక విన్యాసాల సందర్భంగా ఒక స‌మావేశం జ‌రిగింది.  అందులో ఒక విద్యార్థి స్కాట్ స్విప్ట్ ను ఉద్దేశించి ఒక ప్ర‌శ్న అడిగారు... వచ్చేవారం చైనాపై అణుదాడి చేయండి.. అని ట్రంప్‌ ఆదేశిస్తే, మీరు పాటిస్తారా?...అని అడిగాడు. స్కాట్ దీటుగా స‌మాధానం చెప్పారు. క‌చ్చితంగా అమెరికా ప్ర‌యోజ‌నాలు మాత్ర‌మే మాకు కావాలి. అమెరికాలోని ప్రతి సైనికుడూ రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రమాణం చేస్తారు. దేశీయ, విదేశీ శత్రువుల నుంచి కాపాడేందుకు సిద్ధంగా ఉంటారు. దేశాధ్యక్షుడు ఆదేశిస్తే చైనా పైన మాత్ర‌మే కాదు ఏ దేశం పై దాడులు చేయ్య‌మ‌న్న చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)