బ్యాంక్ ఎకౌంట్ కి పోర్టబులిటీ..

First Published Aug 1, 2017, 2:51 PM IST
Highlights
  • త్వరలోనే అమలులోకి
  • బ్యాంకులను ఆదేశించిన ఆర్ బిఐ

మొబైల్ ఫోన్ పోర్టబులిటీ గురించి అందరికీ తెలుసు.. మనం ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్ కి మారినప్పుడు మన ఫోన్ నెంబర్ మారకుండా పోర్టబులిటీ పెట్టకుంటాం. దీని వల్ల మన కుటుంబసభ్యులకు.. మిత్రులకు మన ఫోన్ నెంబర్ మళ్లీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ.. బ్యాంక్ అకౌంట్ విషయంలో అలా కాదు. ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో దానికి మారాలంటే.. దానిని మూసివేసి.. మళ్లీ కొత్తగా ఇంకో ఎకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. ఈ సమస్యకు ఆర్ బిఐ( రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) త్వరలోనే పరిష్కారం చూపనుంది.

ఇందులో భాగంగానే బ్యాంక్ ఎకౌంట్ పోర్టబులిటీ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఈ దిశగా పనిచేయాల్సిందిగా ఇప్పటికే బ్యాంకులకు సూచించింది. ఈ విధానం అమల్లోకి వస్తే  వినియోగదారుల సేవల్లో నాణ్యత పెరుగుతుందని ఆర్ బిఐ పేర్కొంది. నిజంగా ఈ విధానం కనుక అమల్లోకి వస్తే.. చాలా మంది సమస్య తీరుతుంది.

click me!