బిజెపి కార్యాలయంపై పెట్రోల్ బాంబ్ దాడి (వీడిమో)

First Published Mar 7, 2018, 1:30 PM IST
Highlights
  • కోయంబత్తూరు బిజెపి కార్యాలయంపై బాంబు దాడి
  • పెట్రోల్ బాంబు విసిరిన తంతి పెరియార్ ద్రావిడ కలగం పార్టీ కార్యకర్త

తమిళనాడులో రాజకీయ పార్టీల మద్య మాటల యుద్దం కాస్తా దాడుల వరకు వెళ్లింది. ఇటీవల పెరియార్ విగ్రహ ద్వంసానికి బిజెపి పార్టీయే కారణమంటూ బిజెపి కోయంబత్తూరు జిల్లా కేంద్ర కార్యాలయంపై కొందరు వ్యక్తులు బాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనతో మరోసారి తమిళనాట అలజడి రేగింది.

ఈ దాడికి సంబందించిన వివరాలిలా ఉన్నాయి. కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయం దగ్గరకు ఇద్దరు యువకులు బైక్ లో వచ్చారు. కార్యాలయం ముందు ఆగి తమవెంట తీసుకువచ్చిన పెట్రోల్ బాంబును బీజేపీ కార్యాలయం మీదకు విసిరి అక్కడి నుంచి పరారైనారు. ఈ దృశ్యాలన్నీ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే ఈ దాడికి పాల్పడ్డ తంతి పెరియార్ ద్రావిడ కలగం (టీపీడీకే)కు చెందిన బాలు అనే యువకుడు బుధవారం కోయంబత్తూరు పోలీసుల ముందు లొంగిపోయాడు. 

ఈ దాడితో తమిళనాడులో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య హింస చేలరేగే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న పెరియార్ విగ్రహాలకు, బీజేపీ కార్యాలయాల దగ్గర పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.  

అర్థరాత్రి కార్యాలయంపై బాంబులతో దాడిచేస్తున్న వీడియోను కింద చూడండి

Coimbatore: A petrol bomb was hurled at BJP office earlier today #TamilNadu pic.twitter.com/hl3WRO0aB7

— ANI (@ANI)

 

click me!