శుభవార్త: 10కి చేరనున్ననీట్ పరీక్షా కేంద్రాలు

First Published Nov 20, 2017, 7:03 PM IST
Highlights
  • ఎపిలో పెరగనున్న నీట్ పరీక్ష కేంద్రాలు
  • ఇప్పటికే ఎపిలో నాలుగు నగరాల్లో పరీక్షకేంద్రాలున్నాయి
  • వాటితో పాటు మరో ఆరు నగరాల్లో పరీక్ష కేంద్రాలు 

అమరావతి, నవంబర్ 20 : రాష్ట్రంలో కొత్తగా ఆరు నీట్ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు కేంద్రాల్లో మాత్రమే నీట్ పరీక్షా కేంద్రాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నీట్ పరీక్షా కేంద్రాలు పదికి చేరుకోనున్నాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో మాత్రమే నీట్ పరీక్షా కేంద్రాలు ఉండడంతో, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనిని గుర్తించి, తక్షణమే రాష్ట్రంలో నీట్ పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచాలని ఇటీవల కేంద్రమంత్రి జేపీ నడ్డాను కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, కొత్తగా ఆరు పరీక్షా కేంద్రాలను పెంచడానికి అంగీకరించిందని మంత్రి తెలిపారు. పరీక్షా కేంద్రాల పెంపుదలతో రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు కొత్తగా మంజూరు చేసిన కేంద్రాలు- విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, చీరాల, నెల్లూరు, కర్నూలు.

click me!