జాతీయ స్వాభిమానం  నిరసన గొంతును నొక్కేస్తోంది

First Published Aug 7, 2017, 2:14 PM IST
Highlights
  • జాతీయ స్వాభిమానం  నిరసన గొంతును నొక్కేస్తోంది
  • దాదాపు 61శాతం మంది ఎంపీలు 50శాతం ఓట్లను కూడా పొందలేదు

 

 

దేశంలో జాతీయవాదం పెరిగిపోతోందని భారత ఉప రాష్ట్రపతి  హమీద్ అన్సారీ అన్నారు.   

ఆదివారం  బెంగళూరులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం 25వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ పాల్గొని.. విద్యార్థులకు  పతకాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్వాభిమానం  నిరసన గొంతును నొక్కేస్తోందని హన్సారీ ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయుల మధ్య సమైక్యత తగ్గి పోయి.. భారత్ తనతో తానే యుద్ధం  చేస్తుందని ఆయన అన్నారు. నక్సల్ తిరుగుబాటు, వ్యవసాయ రగంలో  ఆటుపాట్లు, స్థానిక భాషల సమస్యలను  రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. వ్యవస్థలోని సంస్థలు ఎప్పుడూ  ప్రజాస్వామ్యానికి తీర్పు ఇవ్వలేవని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

2014  సాధారణ ఎన్నికల్లో... దాదాపు 61శాతం మంది ఎంపీలు 50శాతం ఓట్లను కూడా పొందలేదని ఆయన అన్నారు. భారత జనాభాలో 14.23శాతం మంది ముస్లింలు ఉన్నారన్నారు. మొత్తం లోక్ సభ, రాజ్యసభల్లో 790మంది సభ్యలు ఉండగా.. 1980లో 49మంది ముస్లిం సభ్యులు ఉండేవారన్నారు. 1999 నుంచి 2009ల కాలంలో ముస్లిం సభ్యలు సంఖ్య 30 నుంచి 35 వరకు ఉన్నారని ఆయన తెలిపారు. అది 2014 వచ్చే సరికి ముస్లిం సభ్యుల సంఖ్య 23కి  చేరిందని ఆయన చెప్పారు.

click me!